ఎస్సైగా ఎంపికై న వలంటీర్‌కు సన్మానం | - | Sakshi
Sakshi News home page

ఎస్సైగా ఎంపికై న వలంటీర్‌కు సన్మానం

Dec 23 2023 5:00 AM | Updated on Dec 23 2023 11:07 AM

- - Sakshi

మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని ఎస్సీ బీసీ కాలనీ 6వ సచివాలయంలో వలంటీరుగా సేవలందిస్తూ ఖాళీ సమయంలో ఎస్సై ఉద్యోగానికి సిద్ధమై విజయం సాధించిన వలంటీరు జి.యోగీశ్వరిని శుక్రవారం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ బాలమురళీకృష్ణ ఘనంగా సన్మానించారు. కష్టపడితే మంచి ఉద్యోగం సాధించవచ్చని యోగీశ్వరి నిరూపించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

వలంటీర్‌గా అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సహకారం అందించిన ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, ప్రోత్సహించిన సయ్యద్‌ అబ్దుల్‌ ఖాదర్‌ జిలానీ, బత్తుల లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బందికి యోగీశ్వరి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement