నేటి సాయంత్రం వరకు డెడ్‌లైన్ సోమవారం నుంచి అత్యవసర సేవల నిలిపివేత ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంపై జూడాల ఆగ్రహం జూడాల సమ్మెకు మద్దతు ప్రకటించిన డీవైఎఫ్‌ఐ
మార్కాపురం రోడ్ స్టేషన్ మీదుగా ప్రత్యేక రైలు
మార్కాపురం: ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి–విశాఖపట్నం మధ్య గుంతకల్, గుంటూరు మీదుగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు డీఆర్‌యూసీసీ మెంబరు తెలిపారు. ఈ ప్రత్యేక రైలు మార్కాపురం రైల్వేస్టేషన్‌లో నిలపనున్నారు. ఈనెల 16 నుంచి సెప్టెంబరు 10 వరకూ రైళ్లు నడవనున్నాయి. 08509 నంబరుగల తిరుపతి–విశాఖపట్నం రైలు 16 నుంచి ప్రారంభం కానుంది. మార్కాపురం రోడ్‌కు రాత్రి గం.8.45 కు చేరుకుని గం.8.47 బయలుదేరుతుంది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 11 వరకూ విశాఖపట్నం–తిరుపతి ప్రత్యేక రైలు నడుస్తుందని, మార్కాపురం రోడ్ స్టేషన్‌కు తెల్లవారుజామున గం.4.10కి చేరుకుని గం.4.12కు బయలుదేరుతుందని తెలిపారు. తిరుపతి, కడప, గుంతకల్, గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైలు ఉపయోగపడనుంది.
ఒంగోలు టౌన్: జూనియర్ డాక్టర్లు పూర్తిస్థాయి సమ్మెలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ గత మంగళవారం నుంచి సమ్మె చేపట్టారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన వైద్యసేవలను బహిష్కరించారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందనలేదు. కనీనసం జూనియర్ డాక్టర్లతో చర్చించే ప్రయత్నం కూడా చేయలేదు. దాంతో సోమవారం నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఐసీయూ, అత్యవసర శస్త్ర చికిత్సలు, క్యాజువాలిటీ సేవలు, గైనిక్ సేవలను బహిష్కరించనున్నారు. ఈ విషయాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇచ్చినట్లు జూడాలు తెలిపారు. శనివారం సాయంత్రం వరకు ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించిన జూనియర్ డాక్టర్లు అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే పూర్తి స్థాయి సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు. జూనియర్ డాక్టర్ల హెచ్చరిక మీద ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించడంలేదు.
కలెక్టరేట్ వరకు ర్యాలీ...
స్టెత్ పట్టే చేతులు ప్లకార్డులు పట్టుకున్నాయి. రోగులకు సేవలు చేసే వైద్యులు న్యాయం కోసం రోడ్డెక్కారు. నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో శుక్రవారం జూనియర్ డాక్టర్లు నిరసనగా ర్యాలీ చేశారు. మెడికల్ కాలేజీ నుంచి నెల్లూరు బస్టాండు సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్టై ఫండ్ మా హక్కు, మాకు న్యాయం చేయండని నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ పి.రాజాబాబుకు వినతి పత్రం సమర్పించారు. మరోవైపు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్ల సమ్మెను విరమింపచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఇంత బాధ్యతారాహిత్యం పనికిరాదని విమర్శిస్తున్నాయి.
మద్దతు ప్రకటించిన డీవైఎఫ్‌ఐ ...
జూనియర్ డాక్టర్ల సమ్మెకు అన్నీ వైపుల నుంచి మద్దతు వస్తోంది. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) జిల్లా కమిటీ జూడాల సమ్మెకు మద్దతు ప్రకటించింది. దీక్షా శిబిరాన్ని సందర్శించిన డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కేఎఫ్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జూనియర్ డాక్టర్ల సమ్మెను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. వైద్య సేవలకు కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఇబ్బంది పడకుండా చూడాల్సిన పాలకులు మొండిగా వ్యవహరించడం సమర్ధనీయం కాదన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకుడు మరళి, జూడా జనరల్ సెక్రటరీలు క్రిసికాంత్, రవితేజ, ఉపాధ్యక్షురాలు ఫైజా ఖాన్ పాల్గొ న్నారు.


