యర్రగొండపాలెం: స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన వారిలో నల్లమల అటవీ ప్రాంతంలో నివశించే గిరిజన బిడ్డలు కూడా ఉన్నారు. దోర్నాల మండలంలోని తుమ్మలబైలు చెంచు గూడెంకు చెందిన కుడుమల పెద్ద బయన్న అలియాస్ పెద్ద బైలోడు, అటవీ ప్రాంతంలో ఉన్న కొత్తపల్లి (పస్తుతం నంద్యాల జిల్లాలో ఉంది) చెంచు గూడెంకు చెందిన హనుమంతప్పలు 1930–38 మధ్య మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రిటీష్ ప్రభుత్వం అమలు చేసిన చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు. వీరిని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి తమ కస్టడీలో ఉంచుకొని నానా హింసలకు గురిచేసింది. అ సందర్భంగా ఉద్యమంలో పాల్గొన్న వారిని 25 ఏప్రిల్ 1938లో నల్లమల అటవీ ప్రాంతంలోకి తీసుకొని వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో గిరిజన బిడ్డలు అశువులు బాశారు.
హనుమంతప్ప
పెద్ద బయ్యన్న


