సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. స్వాతంత్ర్య దినోత్సవం సందేశం ఇచ్చారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేసేందుకు మనల్ని మనం పునరంకితం చేసుకుందాం. మన గొప్ప దేశ నిర్మాణానికి మార్గదర్శకంగా నిలిచిన ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడుతూ ముందుకు సాగుదాం. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల నుంచి స్ఫూర్తి పొంది, మరింత ఉజ్వలమైన, సమగ్రతతో కూడిన, సుసంపన్నమైన భారతదేశ నిర్మాణానికి మన వంతు కృషి చేద్దాం. జై హింద్! అని పోస్టు చేశారు.
On this 80th #IndependenceDay, let us rededicate ourselves to the democratic principles that continue to build our great Nation. May our generation draw inspiration from our freedom fighters and work towards a brighter, more inclusive, and prosperous India.
Jai Hind!— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2026


