చంద్రబాబు అరాచకాలు.. ప్రజలకు ఆ మాత్రం తెలియదా?: సజ్జల | Sajjala Ramakrishna Reddy Slams Chandrababu Officials Transfers | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అరాచకాలు.. ప్రజలకు ఆ మాత్రం తెలియదా?: సజ్జల

Apr 4 2024 1:36 PM | Updated on Apr 4 2024 3:56 PM

Sajjala Ramakrishna Reddy Slams Chandrababu Officials Transfers - Sakshi

చంద్రబాబు గనుక రేపు అధికారంలోకి వస్తే ఎలా ఉంటోందో శాంపిల్‌ ఈ రెండ్రోజుల్లోనే చూపించారని..

సాక్షి, గుంటూరు: ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నవాళ్లే ఇవాళ లక్ష మంది ఉద్యోగులతో పెన్షన్లు పంచవచ్చని అంటున్నారని ప్రతిపక్షాల తీరుపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం మధ్యాహ్నాం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుపై మండిపడ్డారు.   

చంద్రబాబు స్వార్థం తప్ప మరేమీ చూసుకోలేదు.ఆ స్వార్థంతోనే ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదు. వలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. డబ్బులు లేవని ఇప్పుడు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలకు ఆ మాత్రం తెలియదా?. చంద్రబాబు తీరు చూసి ప్రజలకు ఒక్కసారిగా జన్మభూమి కమిటీల అరాచకాలు గుర్తుకు వచ్చాయి. అందుకే టీడీపీ వాళ్లు మమ్మల్ని తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదని గతంలో ఎవరైతే విమర్శలు చేశారో.. ఇవాళ వాళ్లే లక్ష మంది ఉద్యోగులతో పెన్షన్లు పంచొచ్చు కదా అని అంటున్నారు. 

వలంటీర్‌ వ్యవస్థ లేకపోవడంతో.. 
గతంలో ఒకటో తేదీన వలంటీర్‌ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 80 శాతం పెన్షన్‌ పంపిణీ పూర్తయ్యేది. కానీ, ఇప్పుడు రెండోరోజుకి 60 శాతం పంపిణీ మాత్రమే జరిగింది. పైగా స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సి రావడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు అని సజ్జల ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రజలు కోపంగా ఉన్నారు. ఎంత కోపంగా ఉన్నారనేది టీడీపీ వాళ్ల మాటల్లోనే తెలుస్తోంది.  ఆ విషయం చంద్రబాబుకి తెలుసుకాబట్టే మాపై ఆరోపణలు చేయిస్తున్నారు. చంద్రబాబు ఉద్దేశం ప్రజలకు మంచి చేయడం కాదు. ఎన్నికల్లో ఎలాగైనా బయటపడాలన్నదే ఆలోచన. చంద్రబాబు వస్తే  ఎలా ఉంటుందో ఈ రెండ్రోజుల్లో రుచి చూపించారు. ప్రజలు ఇదంతా అర్థం చేసుకున్నారు. అది రేపు ఎన్నికల్లో తెలుస్తోంది అని సజ్జల అన్నారు.  

అధికారుల బదిలీలపై..
అధికారుల్లో వందశాతం ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు ఉంటారు?. అధికారుల్ని డీమోరలైజ్‌ చేసేందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని సభలో పోలీసుల పాత్ర తక్కువగా ఉంటుంది. చంద్రబాబు, పురందేశ్వరి వైఫల్యాన్ని రాష్ట్ర పోలీసులపై రుద్దే ప్రయత్నం చేశారు. కూటమిలో ఉన్నారు కాబట్టే పైనుంచి ఒత్తిడి చేయించి మరీ అధికారుల్ని బదిలీ చేయించారు. మేం వ్యవస్థల్ని మేనేజ్‌ చేయాలనుకోవట్లేదు. మేం ప్రజలనే నమ్ముకున్నాం. రేపు మేం గెలిచాక అధికారుల వల్లే గెలిచారు అని అనడానికి వాళ్లకు ఇప్పుడు లేకుండా పోయింది అని సజ్జల పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement