Minister Botsa Satyanarayana Strong Counter To Pawan Kalyan Over His Comments - Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై మంత్రి బొత్స కౌంటర్‌

Jul 13 2023 11:20 AM | Updated on Jul 13 2023 4:29 PM

Minister Botsa satyanarayana Counter To Pawan Kalyan Comments - Sakshi

సాక్షి, విజయవాడ: పవన్‌ కల్యాణ్ ఆయన పార్టనర్ మాత్రమే హైదరాబాద్‌లో ఉంటారని, ప్రజల డేటాను హైదరాబాద్‌లో ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏ డేటా ఎక్కడ ఉందో పవన్ కళ్యాణ్‌కు తెలుసా? అంటూ ప్రశ్నించారు.

‘‘ప్రజల డేటా ప్రభుత్వం దగ్గర ఉంటుంది. పవన్ గాలి మాటలు మాట్లాడుతున్నారు. వలంటీర్ ఎవరు? ఎలా వచ్చారు? వలంటీర్ విధి విధానాలు పవన్‌కు తెలుసా?. మహిళలపై పవన్‌ అసభ్యకరంగా మాట్లాడటం కరెక్టేనా?. వలంటీర్ వ్యవస్థ వల్ల ప్రభుత్వానికీ మంచి పేరు వస్తోందనే దుర్భుద్ధితోనే ఆరోపణలు’’ అంటూ మంత్రి బొత్స దుయ్యబట్టారు.
చదవండి: ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే.. 

‘‘టీడీపీ సమయంలో సర్వే పేరుతో సమాచారం తీసుకుని ఓటర్ల లిస్ట్‌లో పేర్లు తొలగించారు. అప్పుడు నేనే డీజీపీకి ఫిర్యాదు చేశా. చంద్రబాబు సన్నిహిత సింగపూర్ మంత్రిని అరెస్ట్ చేశారు. ఆ మంత్రినే తీసుకొచ్చి అమరావతిలో చంద్రబాబు అట్టహాసంగా ప్రచారం చేశారు. ఆనాడే చెప్పా సింగపూర్ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం సరైనది కాదని. అన్ని రాష్ట్రాలు వలంటరీ వ్యవస్థను అమలు చేయాలని చూస్తున్నాయి. వలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని పవన్ బురద చల్లాలని చూస్తున్నారు. ఏ నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయో పవన్ కల్యాణ్ చెప్పాలి. నిఘా వర్గాలు ఇచ్చినట్లు అధారాలు ఉంటే చూపించాలి’’ అని మంత్రి బొత్స పేర్కొన్నారు.
చదవండి: భయపెడుతున్నారా? భయపడుతున్నారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement