కుర్చీలను మడత బెట్టడంలో లోకేష్‌ది గిన్నిస్‌రికార్డు: మంత్రి అంబటి

Minister Ambati Rambabu Comments On Nara Lokesh - Sakshi

సాక్షి, తాడేపల్లి: పవన్‌ కల్యాణ్‌ ఆటలో అరటిపండు అంటూ ఎద్దేవా చేశారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా  సమావేశంలో మాట్లాడుతూ, రా కదలిరా సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. శంఖం ఊదలేని స్థితి లోకేష్‌ శంఖారావం ఉందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

‘సిద్ధం’ సభలకు వస్తున్న స్పందన చూసి టీడీపీ నేతల భ్రమలు తొలిగిపోతున్నాయి. మళ్లీ సీఎంగా జగనే అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. 175 స్థానాలకు 175 స్థానాల్లో గెలుస్తాం. అభివృద్ధిపై చర్చకు రమ్మని సిగ్గులేకుండా చంద్రబాబు సవాల్‌ విసురుతున్నారు. అసెంబ్లీ నుంచి పారిపోయిన దద్దమ్మ చంద్రబాబు. సీఎం జగన్‌ను సవాల్‌ చేసే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. చంద్రబాబుతో చర్చకు నేనే సిద్ధం. టీడీపీ కార్యాలయంలోనైనా సరే చర్చకు సిద్ధం. చర్చ అయ్యాక చంద్రబాబు బావురుమని ఏడవకూడదు’’ అంటూ మంత్రి చురకలు అంటించారు.

‘‘చంద్రబాబును ముసలోడు అంటే లోకేష్‌కు ఎందుకు కోపం వస్తుంది. స్కిల్‌ కేసు విచారణలో సమయంలో మా నాన్న ముసలోడని లోకేష్‌ బావురుమన్నాడు. కుర్చీలు మడతబెట్టడంలో లోకేష్‌ది గిన్నిస్‌ రికార్డు. శాసనమండలి కుర్చీ మడతబెట్టాడు. ఐదు శాఖల మంత్రి పదవిని మడతబెట్టాడు. మంగళగిరి ఎమ్మెల్యే సీటును మడతపెట్టాడు. రేపు టీడీపీని కూడా లోకేష్‌ మడతబెట్టేస్తాడు. మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాం. ఈ ఎన్నిలతో టీడీపీ ఖతం అవుతుంది’’ అని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: వాళ్లు 'వ్యూహం' తప్పకుండా చూస్తారు: ఆర్జీవీ 
 

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top