సీఎం రేవంత్‌కు వార్నింగ్‌.. కేటీఆర్‌ షాకింగ్‌ ట్వీట్‌ | Ktr Shocking Tweet On Cm Revanth Reddy | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌కు వార్నింగ్‌.. కేటీఆర్‌ షాకింగ్‌ ట్వీట్‌

Jul 13 2024 10:08 AM | Updated on Jul 13 2024 11:01 AM

Ktr Shocking Tweet On Cm Revanth Reddy

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుంది!.. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు

సాక్షి, హైదరాబాద్‌: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుంది!.. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని  దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కాడు రేవంత్ రెడ్డి’’ అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుంచి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్దిదారుల నుండి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ఒక లక్షా 72 వేల రూపాయలు వెనక్కు కట్టాలని నోటీసు ఇచ్చారు.’’ అంటూ కేటీఆర్‌ మండిపడ్డారు.

ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుండి కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనం. వెంటనే పేదల మీద ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలి!. లేకుంటే ప్రజలే కాంగ్రెస్ సర్కార్ మీద తిరగబడతారు!’’ అని కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా హెచ్చరించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement