బాబు హెల్త్‌పై ఫ్యామిలీ సభ్యులే తప్పుడు ప్రచారం: మంత్రి అంబటి | Ambati Rambabu Serious Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

బాబు హెల్త్‌పై ఫ్యామిలీ సభ్యులే తప్పుడు ప్రచారం: మంత్రి అంబటి

Oct 15 2023 11:40 AM | Updated on Oct 15 2023 11:58 AM

Ambati Rambabu Serious Comments On Chandrababu - Sakshi

సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నేరం చేశారు కాబట్టే చట్టం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబుపై కక్ష పెంచుకోవాల్సిన పెంచుకోవాల్సిన అవసరం తమకు లేదని అంబటి స్పష్టం​ చేశారు. రాజకీయం వైఎస్సార్‌సీపీ చాలా బలంగా ఉన్నట్టు తెలిపారు. 

కాగా, మంత్రి రాంబాబు ఆదివారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే ఎంత మంది సీనియర్‌ న్యాయవాదులను పెట్టినా బెయిల్‌ దొరకలేదు. చంద్రబాబు నేరం చేశారు కాబట్టే చట్టం చర్యలు తీసుకుంటుంది. చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని కుటుంబ సభ్యులే అబద్దాలు చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యంపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. 

చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని 35 రోజుల నుంచి కోర్టులో ఎందుకు పిటిషన్‌ వేయలేదు. చంద్రబాబుకు ఎప్పటినుంచో చర్మ సమస్యలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనూ ఎవరికీ ఏసీ ఇవ్వలేదు.. కానీ, చంద్రబాబుకు ఇచ్చారు అని అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement