చెన్నై: తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాట్సాప్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్, అపాయింట్‌మెంట్ పొందే ఇంటిగ్రేటెడ్ డిజిటల్ వేదిక www.nalam.tn.gov.in ను సీఎం విజయ్ మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య శాలల్లో సేవలను సామాన్య ప్రజలకు మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని సీఎం తెలిపారు.
9619222999 వాట్సాప్ నంబర్‌కు ‘ ఏజీ‘ అంటూ మెసేజీ చేయడం ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం www.nalam.tn. gov.in ను చెన్నై, చెంగల్పట్టు సహా 22 జిల్లాల్లో ప్రయోగా త్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల మెరుగు దలకు నేరుగా వైద్య పరికరాలను స్పాన్సర్ చేయవచ్చు, విరాళాలు అందించవచ్చు.


