అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య భవ్య రామమందిర మొట్టమొదటి ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) పోస్టు కోసం మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ పోటీ పడుతున్నారు. ఆయన 1992 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి. 2021 మార్చి 23న కేంద్ర హోంశాఖ ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించింది. లేకపోతే 2028 వరకు సర్వీసులో కొనసాగేవారు. అమితాబ్ ఠాకూర్‌పై పలు ఆరోపణలు వచ్చాయి.
శాఖాపరంగా విచారణ జరిగింది. ఆరోపణలు నిజమేనని తేలడంతో హోంశాఖ ఆదేశాల మేరకు బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఉద్యోగం నుంచి తప్పుకున్నప్పటికీ ప్రజా జీవితంలో కొనసాగుతానని, ‘అధికార్ సేన’పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో(2022) పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ, పార్టీని స్థాపించలేదు. అందుకు కారణాలు ఏమిటో ఆయన వెల్లడించలేదు.


