breaking news
Ayodhya Balak Ram
-
అయోధ్యకు క్యూ కట్టిన భక్తులు.. ఇప్పటి వరకు దర్శనాలు, హుండీ..
అయోధ్య: యూపీలోని అయోధ్య మందిరానికి భక్తులు క్యూ కడుతున్నారు. బాలరాముడిని చూసేందుకు దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఇక, కేవలం 11 రోజుల్లోనే ఏకంగా 25 లక్షల మంది భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో రూ.11 కోట్ల మేర హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కాగా, అయోధ్యలోని బాలక్ రాముడి దర్శన మార్గంలో నాలుగు హుండీలను ఏర్పాటు చేశారు. ఇక, గత 11 రోజుల్లో 25లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.8 కోట్లు నగదు రూపంలో, రూ.3.5 కోట్లు చెక్కుల రూపంలో వచ్చాయి. ఇందులో ఆన్లైన్ విరాళాలు కూడా ఉన్నాయి. మొత్తం 14 మందితో కూడిన బృందం ఈ హుండీల్లోని విరాళాలను లెక్కించింది. ఇక, భక్తులు కానుకలు సమర్పించడం నుంచి వాటిని లెక్కింపు వరకూ అంతా సీసీటీవీ కెమెరాల నిఘా పర్యవేక్షణలోనే జరుగుతుందని ఆలయ ట్రస్టు ఆఫీస్ ఇన్ఛార్జి ప్రకాశ్ గుప్తా తెలిపారు. VIDEO | Devotees continue to throng Ayodhya's Ram Mandir for 'darshan' of Ram Lalla. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz)#AyodhyaRamMandir pic.twitter.com/cweNluhV8U — Press Trust of India (@PTI_News) February 2, 2024 ఇదిలా ఉండగా.. భారీసంఖ్యలో వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అయోధ్యలోని బాలరాముడి మందిరంలో స్వామి దర్శన సమయాన్ని ఆలయ నిర్వాహకులు ఇటీవల పొడిగించారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతకుముందు ఆలయ దర్శన వేళలు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఉండేవి. #WATCH | Uttar Pradesh: Devotees gather at Rampath for the darshan of Ram Lalla at Shri Ram Janmabhoomi Temple in Ayodhya. pic.twitter.com/tpmVFU2jH0 — ANI (@ANI) February 2, 2024 -
Ayodhya: అయోధ్యకు వెళ్లే బస్సులు రద్దు!
ఢిల్లీ: అయోధ్య బాలక్ రామ్ మందిర్కు ఎగబడుతున్న భక్తులకు, సందర్శకులకు పెద్ద షాకే తగిలింది. అయోధ్య వైపు వెళ్లే బస్సులను రద్దు చేస్తున్నట్లు బుధవారం అక్కడి రవాణా శాఖ ప్రకటించింది. తిరిగి బస్సులు ఎప్పుడు నడుస్తాయనేది ఇప్పట్లో చెప్పలేమని స్పష్టం చేసింది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట తర్వాత ‘బాలక్ రామ్’ దర్శనం కోసం భక్తులు ఎగబడి పోతున్నారు. దేశవ్యాప్తంగా అయోధ్య వైపు అడుగులేస్తున్నారు. తొలిరోజే ఏకంగా ఐదు లక్షల మంది దర్శించుకునేందుకు వచ్చినట్లు ఓ అంచనా. అందులో 3 లక్షల మందిదాకా దర్శించుకోగా.. మరో రెండు లక్షల మంది బయట ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఈ క్రమంలో నిన్న అధికారులకు భక్తుల నియంత్రణ కష్టతరంగా మారింది. ఇదీ చదవండి: బాలక్ రామ్ కోసం.. ఈ నిరీక్షణ చూశారా? దీంతో ఇవాళ కేంద్ర బలగాలను సైతం మోహరించారు. మొత్తం అయోధ్యలో 8 వేలమంది సిబ్బందిని భద్రత కోసమే మోహరించారు. అదే సమయంలో లక్నో, ఇతర ప్రాంతాల నుంచి అయోధ్యకు బస్సుల్లో భక్తులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో రద్దీని నిలువరించేందుకు బస్సు సర్వీసులన్నింటినీ రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తేనే తిరిగి సర్వీసులు నడుపుతామని ఓ అధికారి మీడియాకు వివరించారు. ఇక.. దైవదర్శనం కోసం తొందరపడొద్దని.. రెండు వారాల తర్వాత రద్దీ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయని భక్తులకు, సందర్శకులకు అయోధ్య ఐజీ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు నిదానంగా రావాలని కోరుతున్నారాయన.