శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్‌ | A man in Agra did this to his mother | Sakshi
Sakshi News home page

శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్‌

Jul 13 2026 7:34 PM | Updated on Jul 13 2026 7:43 PM

A man in Agra did this to his mother

ఆగ్రా: ఓ వ్యక్తి తన కన్నతల్లికి విషం పెట్టాడు. పిల్లనిచ్చిన అత్త మాటలు విని ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు అతడు. ఈ ఘటన ఆగ్రాలోని పిధౌరా పరిధిలో ఉన్న బర్పురా గ్రామంలో జరిగింది. నిందితుడు రవీంద్ర, అతని తమ్ముడు ముకేశ్ మధ్య భూ వివాదం తలెత్తింది. ఆ వివాదం తర్వాత రవీంద్ర భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. 

భార్యను తిరిగి తీసుకురావడానికి రవీంద్ర అత్తింటికి వెళ్లగా, అతని అత్త ఓ షరతు పెట్టింది. తన కూతురిని తిరిగి పంపాలంటే ‘‘ముందుగా నీ తల్లిని చంపాలి’’ అని ఆమె చెప్పింది. తల్లికి పెట్టే శనగ కూరలో విషం కలిపి చంపాలని కూడా అత్త సూచించింది. రవీంద్ర ఆ షరతుకు అంగీకరించి ఇంటికి వచ్చాడు. అనంతరం శనగ కూరలో విషం కలిపి తన తల్లికి తినిపించాడు. దీంతో ఆమె ఆరోగ్యం విషమించింది.

కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసులు రవీంద్రను అరెస్టు చేశారు. అతని అత్త ఫూల్వతి పరారీలో ఉండగా, ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.

ఈ కేసు వివరాలను సహాయ పోలీసు కమిషనర్ రాజీవ్ రంజన్ వెల్లడించారు. రవీంద్రను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఫూల్వతిని పట్టుకునేందుకు దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement