కొండపై నుంచి తోసేసింది సియానే! | Siya Goyal Pushed fiance Ketan Agarwal from Lohagad fort | Sakshi
Sakshi News home page

కొండపై నుంచి తోసేసింది సియానే!

Jun 27 2026 4:57 AM | Updated on Jul 3 2026 2:16 PM

Siya Goyal Pushed fiance Ketan Agarwal from Lohagad fort

కేతన్‌ అగర్వాల్‌ను త్వరగా హత్య చేయాలంటూ చేతన్‌ ఒత్తిడి  

ప్రియుడి మైకంలో పడి కాబోయే భర్తను అంతం చేసిన సియా గోయల్‌  

ఫాస్ట్‌–ట్రాక్‌ కోర్టు ట్రయల్‌కు ప్రభుత్వం అంగీకారం  

ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఉజ్వల్‌ నికమ్‌  

పుణే: దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన పుణే యువ వ్యాపారవేత్త కేతన్‌ అగర్వాల్‌ హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భార్య సియా గోయల్‌ స్వయంగా అతడిని కొండపై నుంచి తోసివేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ దారుణం వెనుక సియా చౌదరి ప్రియుడు చేతన్‌ చౌదరి ప్రోద్బలం ఉన్నట్లు బహిర్గతమయ్యింది. 

కేతన్‌ అగర్వాల్‌ను సాధ్యమైనంత త్వరగా అంతం చేయాలంటూ చేతన్‌ చౌదరి తన ప్రియురాలు సియా చౌదరిపై పదేపదే ఒత్తిడి చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. పూర్తిగా అతడి మైకంలో పడిపోయిన సియా చౌదరి మరో ఆలోచన లేకుండా.. కాబోయే భర్తను చేతులారా చంపేసిందని తెలిపారు. ఇద్దరు నిందితులను ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రియుడి ఒత్తిడి వల్లే చేతన్‌ను లోహగఢ్‌ కోటకు రప్పించి హత్య చేసినట్లు సియా గోయల్‌ ఒప్పుకుందని స్పష్టంచేశారు. 

ఆమె సోదరుడిని కూడా ప్రశ్నిస్తున్నామని అన్నారు. మరోవైపు ఈ కేసులో ఫాస్ట్‌–ట్రాక్‌ కోర్టు ట్రయల్‌ నిర్వహించాలంటూ కేతన్‌ అగర్వాల్‌ కుటుంబం డిమాండ్‌ చేయగా, మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రఖ్యాత లాయర్‌ ఉజ్వల్‌ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కేసుతోపాటు మరికొన్ని ముఖ్యమైన కేసుల్లో ఉజ్వల్‌ నికమ్‌ వాదించారు. 20 ఏళ్ల సియా గోయల్, 22 ఏళ్ల చేతన్‌ చౌదరి గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 18న కేతన్‌ అగర్వాల్‌(25)ను పుణే సమీపంలోని లోహగఢ్‌ కోటలో అంతమొందించిన సంగతి తెలిసిందే.  

హత్యకు పకడ్బందీగా ప్లాన్‌  
కేతన్‌ అగర్వాల్‌ హ త్యకు నిందితులు పకడ్బందీగా ప్లాన్‌ చేశా రు. ఆధారాలు దొర క్కుండా జాగ్రత్తపడ్డా రు. హత్యకు ముందు, తర్వాత తమ సెల్‌ఫోన్లలో చాటింగ్‌ హిస్టరీని పూర్తిగా తొలగించారు. రీసైకిల్‌ బిన్లను కూడా ఖాళీచేశారు. వారి ఫోన్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. డిలీట్‌ చేసిన వివరాలను తిరిగి రప్పిస్తే కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందని అన్నారు. సియా గోయల్, కేతన్‌ చౌదరి మధ్య ఫోన్లలో 238 గంటలపాటు సంభాషణ జరిగినట్లు ఇప్పటికే గుర్తించారు. వారిద్దరూ గత ఆరు నెలల వ్యవధిలో 2,004 ఫోన్‌కాల్స్‌ చేసుకున్నారు. హత్య జరిగిన రోజు ఓ హోటల్‌లో కలుసుకున్నారు. మర్డర్‌ ప్లాన్‌ గురించి చర్చించుకున్నారు.  

కేతన్‌ బట్టతల నచ్చకనే హత్య!  
కాబోయే భర్త కేతన్‌ అగర్వాల్‌కు బట్టతల ఉండడం, అది కనిపించకుండా విగ్గు లాంటిది ధరించడం తనకు నచ్చలేదని, అందుకు అడ్డు తొలగించుకున్నానని సియా చౌదరి చెబుతున్నట్లు సమాచారం. బట్టతల కారణంగానే కేతన్‌ హత్యకు గురయ్యాడంటూ ప్రచారం సాగుతోంది. అయితే, ఈ విషయాన్ని కేతన్‌ తండ్రి విశాల్‌ అగర్వాల్‌ ఖండించారు. కేతన్‌కు బట్టతల ఉందన్న విషయంలో ఎంగేజ్‌మెంట్‌కు ముందే సియా గోయల్‌కు, ఆమె కుటుంబానికి తెలుసని అన్నారు. బట్టతల విషయంలో ఆమె ఏనాడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని చెప్పారు. తన కుమారుడు నిజంగా నచ్చకపోతే ముందే చెప్పాలి తప్ప ఇలా హత్య చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తంచేశారు. కేతన్‌ హత్యకు అతడి బట్టతల అంశం ఒక్కటే కారణం కాదని పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement