పెళ్లి చేసుకున్న అక్కా తమ్ముడు..! | Sister and Brother Marriage In Bangalore | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకున్న అక్కా తమ్ముడు..!

May 8 2026 10:36 AM | Updated on May 9 2026 12:30 PM

Sister and Brother Marriage In Bangalore

బెంగళూరు: రక్త సంబంధం మరిచి పెద్దమ్మ కూతురిని పిన్నమ్మ కొడుకు పెళ్లి చేసుకొన్న వింత సంఘటన చిక్కబళ్లాపురంలో గురువారం జరిగింది. అపహాస్యమవుతున్న మానవ సంబంధాలకు అద్దం పట్టేలా ఈ జంట పెళ్లి సాగింది. వివరాలు.. బెంగళూరు రూరల్‌లోని దేవనహళ్లిలో సావకనహళ్లి కి చెందిన శశికళ, హొసకోటకు చెందిన ప్రవీణ్‌ తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు. ప్రవీణ్‌ కంటే శశికళ కొంచెం వయసులో పెద్దది. అలా వీరు అక్కా తమ్ముడు అవుతారు. కానీ వరుస దారి తప్పింది. గత మూడేళ్ల నుంచి ప్రేమించుకొన్నారు.

మరోవైపు శశికళ తల్లిదండ్రులు ఆమెకు ఓ సంబంధం చూసి పెళ్లిని ఖాయం చేశారు. పెళ్లిపత్రికలు కూడా పంచుతున్నారు. ఇంతలో శశికళ, తమ్ముడు ప్రవీణ్‌తో కలిసి వెళ్లిపోయింది, చిక్కబళ్లాపురం దగ్గర అంగట్ట గ్రామంలోని ఈశ్వరుని ఆలయంలో తాళి కట్టి మనువాడారు.

భద్రత కోసం ఫిర్యాదు
తల్లిదండ్రుల నుంచి మాకు బెదిరింపులు వచ్చాయని, భద్రత కావాలని చిక్కబళ్లాపురంలో ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. కూతురిని ఆ పరిస్థితిలో చూసిన తల్లి బోరున రోదించింది. నువ్వు తమ్మున్నే పెళ్లి చేసుకొంటావా అని నిలదీసింది. ఏమాత్రం చలించని శశికళ, తాను ప్రవీణ్‌తో జీవిస్తానని చెప్పింది. ఈ వివాహం చుట్టుపక్కల సంచలనమైంది.

అత్తపై అల్లుడు అత్యాచారం



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement