అత్తపై అల్లుడు అత్యాచారం | Telangana Shock, Man Held For Allegedly Assaulting Mother-in-Law Amid Family Dispute, Details Inside | Sakshi
Sakshi News home page

అత్తపై అల్లుడు అత్యాచారం

May 9 2026 11:55 AM | Updated on May 9 2026 12:33 PM

 Sangareddy Shocking Incident

 జోగిపేట(అందోల్‌): మద్యానికి బానిసై కామంతో కళ్లు మూసుకుపోయి భార్యాభర్తల మధ్య ఉన్న గొడవను సర్దిచెప్పేందుకు వచ్చిన అత్తపై సొంత అల్లుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం ఖాదిరాబాద్‌లో చోటుచేసుకుంది. సీఐ అనిల్‌కుమార్‌ చెప్పిన కథనం ప్రకారం..గ్రామానికి చెందిన మహ్మద్‌ గరీబ్‌ ప్రతీరోజు మద్యం తాగి భార్యతో గొడవ పడుతుండేవాడు. గురువారం రాత్రి ఘర్షణ పడుతుండగా సయోధ్య కుదుర్చేందుకు అత్త వచి్చంది. 

నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసింది. అప్పటికే మత్తులో ఉన్న మహ్మద్‌ గరీబ్‌...భార్యను గదిలోకి నెట్టేసి గడియపెట్టి అత్తపై అత్యాచారం జరిపి బయటకు పారిపోయాడు. ఈ విషయాన్ని అత్త బయటకు వచ్చి ఇరుగుపొరుగు వారికి తెలియజేసి వట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు గరీబ్‌ను అదుపులోకి తీసుకుని కోర్టుకు రిమాండ్‌కు పంపుతున్నట్లు సీఐ అనిల్‌కుమార్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement