భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్‌ | Nepal also bans Indian mangoes After Japan | Sakshi
Sakshi News home page

భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్‌

Jun 10 2026 3:38 PM | Updated on Jun 10 2026 3:44 PM

Nepal also bans Indian mangoes After Japan

భారత మామిడి రైతులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. అధిక స్థాయిలో రసాయన పురుగుమందులు ఉన్నాయనే ఆరోపణలపై భారత మామిడిని నిషేధించిన దేశాల్లో మరో దేశం చేరింది. ఇటీవల జపాన్‌ ఇండియన్‌ మామిడి పండ్ల దిగుమతులను నిషేధించగా ఇపుడు నేపాల్ కూడా  ఆ బాటలో నడిచింది.

అధిక స్థాయిలో పురుగుమందులు ఉన్న భారత మామిడి పండ్ల దిగుమతిని బాలెన్ షా ప్రభుత్వం నిషేధించింది.నేపాల్ వ్యవసాయ మరియు పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ విధించిన ఈ ఆంక్షలు ఏప్రిల్-మే నెలల  మధ్య  అమలు చేసిందని సమాచారం. నేపాల్ భారతదేశానికి అతిపెద్ద మార్కెట్లలో ఒకటి కానప్పటికీ, ఈ ఆంక్షలు అల్ఫోన్సో, దశేరి, చౌసా, కేసర్, లంగ్రా , బంగనపల్లి వంటి అత్యుత్తమ భారతీయ రకాల ఎగుమతులపై ప్రభావం ఉంటుందని మార్కెట్‌నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు రసాయన పురుగు మందుల ఆనవాళ్లు ఉండటం భారతదేశపు పండ్ల ఉత్పత్తి విధానంపై సందేహాలను రేకెత్తిస్తోంది.

ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్త

నేపాల్ కూడా  పరిమితంగానైనా  మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది. అయితే, స్థానిక డిమాండ్‌ను తీర్చడానికి దేశీయ ఉత్పత్తి సరిపోవడం లేదు.  మే మధ్య నుండి జూలై మధ్య వరకు ఇవి అందుబాటులో ఉంటాయి.  మధేష్ ప్రావిన్స్‌లోని సిరహా, సప్తరి , ధనుషా జిల్లాలు దేశంలో ప్రధాన మామిడి ఉత్పత్తి కేంద్రాలు. భారతీయ మామిడి పండ్లపై విధించిన ఈ ఆంక్షలు దేశీయ పండ్ల రకాలకు ప్రయోజనం చేకూరుస్తుందని నేపాల్ అధికారులు అంటున్నారు. భారతదేశం ఏటా 24 మిలియన్ మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది, ఇందులో సుమారు 32,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఎగుమతి  చేస్తుండగా,  మిగిలినవి దేశీయ వినియోగానికే.   

ఇదీ చదవండి: హాట్‌ టాపిక్‌గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement