న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం రాత్రి భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రకంపనలు కొన్ని సెకన్ల పాటు కొనసాగినట్లు స్థానికులు తెలిపారు. దీంతో కొందరు ముందుజాగ్రత్తగా ఇళ్ల నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు.
ఉత్తరాఖండ్‌లో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు సమాచారం. దీని ప్రభావంతో ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రకంపనల కారణంగా ఎక్కడైనా నష్టం వాటిల్లిందా? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే, ప్రకంపనల తీవ్రత, ఇతర పూర్తి వివరాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తూ వివరాలను సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: ఎల్‌నినో సృష్టించనున్న కల్లోలం ఇదేనా?


