అచ్యుతాపురం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన | AP Anakapalle's Atchutapuram SEZ Incident: PM Modi Condolence | Sakshi
Sakshi News home page

అచ్యుతాపురం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Aug 22 2024 7:36 AM | Updated on Aug 22 2024 9:20 AM

AP Anakapalle's Atchutapuram SEZ Incident: PM Modi Condolence

న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో భారీ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు తన ఎక్స్‌ ఖాతా ద్వారా స్పందించారు. 

ఘటన తనను ఎంతో బాధించిందన్న ఆయన.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అలాగే గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్లు ప్రకటించారు. 

అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్సెస్‌ ఫార్మా కంపెనీలో బుధవారం రియాక్టర్‌ పేలిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా 18 మంది మృతి చెందగా.. 35 మంది తీవ్ర గాయాలతో అనకాపల్లి, విశాఖ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement