ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన సమంత | Tollywood actress Samantha announced her pregnency Officially | Sakshi
Sakshi News home page

Samantha: అఫీషియల్‌గా ప్రెగ్నెన్సీ ప్రకటించిన సమంత

Jun 24 2026 8:32 PM | Updated on Jun 24 2026 8:50 PM

Tollywood actress Samantha announced her pregnency Officially

మా ఇంటి బంగారంతో సూపర్ హిట్ కొట్టిన సమంత.. తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. దీంతో తన ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా ఇచ్చింది. తాజాగా ఇవాళ ఏర్పాటు చేసిన మా ఇంటి బంగారం సక్సెస్‌ మీట్‌లో ఈ శుభవార్త పంచుకున్నారు. మరోసారి తన సినిమాలకు గ్యాప్ ఇస్తున్నానని తెలిపింది. ఇప్పటి నుంచి మెటర్నిటీ లీవ్‌లో తీసుకుంటానని సామ్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ తారలు సామ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

కాగా.. గత కొద్ది రోజులుగా సమంత ప్రెగ‍్నెన్సీతో ఉందంటూ రూమర్స్ వినిపించాయి. మా ఇంటి బంగారం మూవీ ప్రమోషన్లతో శారీలో కనిపించండతో ఈ రూమర్స్ ఊపందుకున్నాయి. తాజాగా ఇవాళ సామ్ స్వయంగా ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ ‍అవుతున్నారు. సమంత లీడ్ రోల్‌లో వచ్చిన మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద సూపర్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమా ఇ‍ప్పటికే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజా సామ్ గుడ్‌ న్యూస్‌తో అభిమానులకు డబుల్ బొనాంజా ఇచ్చింది.

సమంత గతేడాది డిసెంబర్‌లో రెండోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడింది. వీరిద్దరి పెళ్లి కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో జరిగింది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement