డ్రైవర్‌గా మారిన సీఎం విజయ్‌.. 130 కిలోమీటర్లు స్వయంగా డ్రైవింగ్! | CM Vijay Drives His Own Convoy For More Than 130KM From Kollur To Mangaluru Airport, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌గా మారిన సీఎం విజయ్‌.. 130 కిలోమీటర్లు స్వయంగా డ్రైవింగ్!

Jun 13 2026 12:54 PM | Updated on Jun 13 2026 1:19 PM

Tamil Nadu CM Vijay Drives His own Convoy For More Than 130KM

తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, పార్టీ పెట్టిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చాడు స్టార్‌ హీరో విజయ్‌. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైనశైలీలో పరిపాలన సాగిస్తున్నాడు. హీరోగా ఉన్నప్పుడే ఆయన చాలా సింపుల్‌ లైఫ్‌ని లీడ్‌ చేసేవాడు. స్టార్‌ అనే గర్వం ఎక్కడ చూపించేవాడు కాదు.  ఇక సీఎం అయిన తర్వాత ఆయనలో మరింత మార్పు వచ్చింది. ఎక్కడ కూడా అధికార గర్వం కనిపించడం లేదు. 

ప్రజలకు మరింత చేరువయ్యేలా ఆయన ప్రణాళికలు ఉంటున్నాయి. తాజాగా ఆయన కర్ణాటక కొల్లూరులోని శ్రీ మూకాంబికా అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అయితే ఈ పర్యటన సందర్భంగా విజయ్ చేసిన ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత విజయ్ ఒక్కసారిగా డ్రైవర్ అవతారం ఎత్తాడు. ఆలయం నుంచి మంగళూరు విమానాశ్రయం వరకు దాదాపు 130 కిలోమీటర్లు కాన్వాయ్‍లో తాను ప్రయాణించే కారును స్వయంగా  డ్రైవ్ చేశారు.

సీఎం విజయ్ కారు నడుపుతుండగా, భద్రతా సిబ్బందికి చెందిన కాన్వాయ్ వాహనాలు ఆయనను అనుసరించాయి. ఈ ప్రయాణంలో భాగంగా ఒక టోల్ గేట్ వద్ద కారు ఆగినప్పుడు, పక్కనే ఉన్న అభిమానులను గమనించిన విజయ్.. ఎంతో నమ్మకంతో, చిరునవ్వుతో వారికి చేయి ఊపుతూ అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement