జబర్దస్త్ ఫైమా పెళ్లి.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియో..! | Jabardasth Comedian Faima Marriage Emotional Farewell Video Goes Viral | Sakshi
Sakshi News home page

Faima: జబర్దస్త్ ఫైమా పెళ్లి.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియో..!

Jul 1 2026 5:37 PM | Updated on Jul 1 2026 5:42 PM

Jabardasth Comedian Faima Marriage Emotional Farewell Video Goes Viral

జబర్దస్త్ కామెడీ షో క్రేజ్ తెచ్చుకున్న ఫైమా ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. తొమ్మిదేళ్ల ప్రేమ తర్వాత చివరికీ మూడుముళ్లతో ఒక్కటయ్యామని ఎమోషనలైంది. తన ప్రియుడు ప్రవీణ్‌తో ఏడడుగులు వేసింది. సంప్రదాయంగా జరిగిన వీరిద్దరి పెళ్లి వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెళ్లి వేడుకలో జబర్దస్త్ కమెడియన్స్ సందడి చేశారు. 

ఈ పెళ్లి జరిగి అప్పుడే వారం రోజులు పూర్తయింది. తాజాగా ఫైమా తన పెళ్లిలోని అరుదైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒకటే సందర్భం.. ఇద్దరు తల్లుల వేదన అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. మెట్టినింటికి వెళ్తున్న కూతురుని చూసి కన్నీళ్లు ఆపుకోలేక ఫైమా తల్లి కన్నీటి పర్యంతమైంది. తన కుమార్తెని హత్తుకుని బోరున ఏడుస్తూ కనిపించింది. ఫుల్ ఎమోషనల్‌గా ఉన్న వీడియోను ఫైమా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అమ్మ ప్రేమకు ఏది సాటి రాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement