సాక్షి, బళ్లారి: మంత్రులకు శాఖల కేటాయింపులో ఎలాంటి గందరగోళం ఉండడు. సోమవారం మంత్రులకు శాఖలు కేటాయింపు ప్రక్రియ పూర్తి అవుతుందని మంత్రి ఈశ్వర్ ఖండ్రే పేర్కొన్నారు. ఆదివారం ఆయన బళ్లారిలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి పదవుల కేటాయింపు అనేది పార్టీ హైకమాండ్ నిర్ణయం. పార్టీ ఎవరెవరికి ఏయే సమయంలో పదవులు ఇవ్వాలనే దానిపై ఆచితూచి అడుగులు వేస్తుందని తెలిపారు. మంత్రి పదవుల కేటాయింపు, శాఖలు గురించి మాజీ మంత్రి శ్రీరాములు మాట్లాడటంలో అర్థం లేదన్నారు. బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్రకు మంత్రి పదవి ఇవ్వడంలో తప్పు లేదని సమర్థించుకున్నారు. 2028లో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతో బీజేపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రిపబ్లిక్ ఆఫ్ బళ్లారి ఎవరి హయాంలో జరిగిందో తెలుసుకోవాలన్నారు. డీకేశీ హయాంలో మహిళలకు కూడా పదవులు దొరకుతాయన్నారు. కార్యక్రమంలో మేయర్ గాదెపప,డీసీసీ అధ్యక్షుడు అల్లం ఫ్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


