హైకోర్టు అదనపు జడ్జిల ప్రమాణం | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు అదనపు జడ్జిల ప్రమాణం

Aug 10 2026 1:04 AM | Updated on Aug 10 2026 1:04 AM

సాక్షి బెంగళూరు: రాష్ట్ర హైకోర్టులో ఆరుమంది అదనపు జడ్జిలు చేరారు. ఆదివారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ సమక్షంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విభు బక్రు వారి చేత ప్రమాణం చేయించారు. సీఎం డీకే శివకుమార్‌, పలువురు మంత్రులు, సీనియర్‌ అధికారులు పాల్గొని జడ్జిలకు శుభాకాంక్షలు తెలిపారు.

నూతన అదనపు జడ్జిల వివరాలు..

● జస్టిస్‌ రాఘవేంద్ర సీతారామ్‌ శ్రీవత్స

● హేమా కులకర్ణి

● సుబ్రమణ్య రంగారావు

● డగవాడి ప్రకాశ్‌ వివేకానంద

● బక్కేశ్వర ప్రమోద్‌

● హోంబేగౌడ శాంతి భూషణ్‌

ప్రమాదంలో జానపద కళలు

మండ్య: ఆధునికత, పెట్టుబడిదారీ విధానం ప్రభావం వల్ల గ్రామీణ జానపద కళలు కనుమరుగవుతున్నాయని, వాటిని పరిరక్షించాలని కర్ణాటక జానపద అకాడమీ అధ్యక్షుడు డాక్టర్‌ గొల్లహళ్లి శివప్రసాద్‌ అన్నారు. వివిధ సంస్థల ఆధ్వర్యంలో గాంధీ భవన్‌లో జరిగిన జానపద సంబ్రాహ్మణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జానపదాలు ఈ నేల యొక్క గుర్తింపు అని, అవి శ్రమకు చిహ్నమని అన్నారు. జానపదాలలో కష్టపడి పనిచేసే జీవితం దాగి ఉందని, అందులో సంగీతం, సాంస్కృతిక వైవిధ్యం, జీవితం ఎలా ఉండేదో, ఎలా ఉండాలో చెప్పే శాసీ్త్రయ సందేశం ఉందని వివరించారు. ఆధునిక జీవితపు హడావుడిలో గ్రామీణ జానపద కళలు కనుమరుగవుతున్నాయని, వాటిని నిత్య జీవితంలోకి తీసుకురావడం ద్వారా పునరుద్ధరించాలని తెలిపారు. సాంస్కృతిక కళలు పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తున్నాయన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో జానపద శాస్త్ర తరగతులను నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా జనపద కళాకారుల ప్రదర్శనలు రంజింపజేశాయి.

గజ దాడిలో

అటవీ ఉద్యోగి మృతి

మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలే మహదేశ్వర వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలోని పొన్నాచి వద్ద హునసే బయలు అడవిలో ఏనుగు దాడిలో ఫారెస్ట్‌ రేంజర్‌ చనిపోయాడు. మలే మహదేశ్వర బెట్ట నివాసి అయిన మహాదేవస్వామి (48) మృతుడు. ఆయన సుమారు 20 ఏళ్లుగా అక్కడే ఫారెస్ట్‌ రేంజర్‌గా పనిచేస్తున్నాడు. వేటగాళ్లు రాకుండా గస్తీ కాస్తుండగా, ఏనుగు వేగంగా వచ్చి ఆయనపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడి స్పహ కోల్పోయాడు. మరో ఇద్దరు సిబ్బంది ఏనుగు దాడి నుంచి తప్పించుకున్నారు. ఇతర సిబ్బంది వెంటనే ఆయనను కొల్లేగాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో మరణించాడు. కుటుంబానికి తగిన పరిహారం చెల్లించాలని, కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని స్థానికులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement