ప్రతిభావంతులకు నాణ్యతతో కూడిన శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ప్రతిభావంతులకు నాణ్యతతో కూడిన శిక్షణ

Aug 10 2026 1:04 AM | Updated on Aug 10 2026 1:04 AM

హుబ్లీ: ఉత్తర కర్ణాటకలోని నిరుపేద గ్రామీణ ప్రతిభావంతులకు వివిధ పోటీ పరీక్షలకు నాణ్యతతో కూడిన శిక్షణ ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు మాజీ సీఎం, ఎంపీ బసవరాజ్‌ బొమ్మై తెలిపారు. స్థానిక ప్రైవేట్‌ హోటల్‌లో సంబంధిత ఉత్తర కర్ణాటక ప్రతిభావంతం మక్కల స్పార్ధాత్మక పరీక్ష హిత రక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర సమాలోచన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంకల్పంతో పనులు నేరవేరుతాయన్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో శిక్షణ కేంద్రం ప్రారంభించడం అందరి ఆశయం అని గుర్తు చేశారు. ప్రభాకర్‌ కోరె సమావేశంలో పాల్గొనడం ఈ శిక్షణ కేంద్రానికి స్ఫూర్తినిస్తుందన్నారు. సదరు కేంద్రం నిపుణుల నేతృత్వంలో ఓ క్రియ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కేంద్రాన్ని బెంగళూరు వరకు విస్తరించేందుకు యోచిస్తునట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదృశ్య కడా సిద్దేశ్వర స్వామి, కన్హేరి స్వామి, మాజీ సీఎం, ఎంపీ జగదీశ్‌ శెట్టర్‌, మాజీ ఎంపీ అన్నసాహేబ్‌ జొల్లే, రమేష్‌ కత్తి, మాజీ మంత్రి శంకర్‌ పాటిల్‌ మునేనకొప్ప తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement