చెలువనారాయణ స్వామి ఊరేగింపు
గజేంద్రమోక్షం అలంకారం
కృష్ణరాజముడి పట్టాభిషేక ఉత్సవం
మండ్య: మండ్య జిల్లాలోని మేలుకోటలోని వెలసిన ప్రఖ్యాత శ్రీ చెలువ నారాయణ స్వామి ఆలయంలో కృష్ణ రాజముడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. మైసూరు ముమ్మడి కృష్ణరాజ ఒడెయార్ సమర్పించిన వజ్రాలు పొదిగిన కృష్ణరాజ ముడి కిరీటం, బంగారు కిరీటాలను శ్రీదేవి, భూదేవి సమేత చెలువ నారాయణునికి అలంకరించి ఊరేగించగా భక్తులు ఆనంద పరవశులయ్యారు. 9 రోజులపాటు జరిగిన జాతర మహోత్సవాలు, కృష్ణరాజముడి ఉత్సవం, ప్రహ్లాద పరిపాలన, గజేంద్రమోక్ష రథోత్సవం, పట్టాభిషేక ఉత్సవాలు నయనానందకరంగా సాగాయి.
ప్రబంధ పారాయణాలు
శ్రీరంగం, కంచి, తిరువల్లికేణి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు 9 రోజులు దివ్య ప్రబంధ పారాయణాలు సాగించగా భక్తకోటికి దివ్య అనుభూతినిచ్చాయి. విద్వాన్ శ్రీరంగం శల్వనారాయణన్ నేతృత్వంలో నాదస్వర, శాక్సోఫోన్ మంగళ వాయిద్యాలు ఉత్సవాలకు ప్రత్యేక హంగులు అద్దాయి. బ్రహ్మోత్సవాలు ముగిసిన పదవ రోజైన ఆదివారంనాడు చెలువ నారాయణస్వామికి లాంఛనప్రాయంగా పుష్ప సమర్పణంతో సమాప్తమయ్యాయి.
నేత్రపర్వంగా కృష్ణ రాజముడి
బ్రహ్మోత్సవాలు
వజ్ర, స్వర్ణ సింహాసనాలతో ఊరేగింపు


