సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు

Aug 8 2026 12:29 AM | Updated on Aug 8 2026 12:29 AM

రాయచూరు రూరల్‌: నగర, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని విధాన పరిషత్‌ సభ్యుడు బసవన గౌడ బాదర్లి ఆదేశించారు. శుక్రవారం సింధనూర్‌ ఎమ్మెల్సీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమ్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం బసవన గౌడ బాదర్లి మాట్లాడుతూ.. మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడిక, చెత్తా చెదారాన్ని వెంటనే తొలగించాలని తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. తుంగభద్ర కాలువ నుంచి చెరువులకు తాగు నీటిని పంపింగ్‌ చేయాలన్నారు. గుంతలు పడిన రహదారులకు మరమ్మతులు చేయాలని తెలిపారు. చౌకధరల దుకాణాల్లో పేదలకు సక్రమంగా బియ్యం పంీపిణీ చేయాలని సూచించారు.

వినాయక చవితి

ప్రశాంతంగా జరుపుకోండి

రాయచూరు రూరల్‌: జిల్లాలో వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా అధికారి పూవిత సూచించారు. గురువారం సాయంత్రం జిల్లా పంచాయతీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. గణేష్‌ ఉత్సవాల్లో భాగంగా మట్టి గణపతులను ప్రతిష్టించి పూజలు చేయాలని తెలిపారు. పీఓపీ, రసాయనిక పదార్థాలను వినియోగించడానికి అవకాశాలు లేవన్నారు. పరిసరాల సంరక్షణ అందరి బాధ్యత అని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌ కాందూ, ఎస్పీ అరుణాంగ్శు గిరి, నగర సభ కమిషనర్‌ జుబీన్‌ మహపాత్రో, గిరీశ, మల్లికార్జున, నందిత, సురేష్‌ వర్మ, హరీష్‌, శాంతవీర, పుష్పలత, ఉమేష్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అంతరంగ భావాలకు అక్షర రూపమే సాహిత్యం

సాక్షి, బళ్లారి: అంతరంగ భావాలకు అక్షర రూపం ఇవ్వడమే సాహిత్యమని ప్రముఖ రంగస్థల కళాకారుడు అంధ్యాళ పురుషోత్తం పేర్కొన్నారు. శుక్రవారం కన్నడ సాహిత్య పరిషత్‌ బళ్లారి గ్రామీణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజల వల్లే కన్నడ భాష, సంస్కృతి నేటికీ సజీవంగా నిలిచి ఉన్నాయని తెలిపారు. నిరక్షరాస్యులు సైతం నాటకాలు, బయలాటల ద్వారా జీవిత విలువలను అలవరచుకుని నైతిక జీవనం గడిపిన అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు. సర్వజ్ఞుడు ప్రతి ఒక్కరి నుంచి మంచిని గ్రహించి విద్యావంతుడిగా ఎదిగి సాహిత్య రంగంలో చక్రవర్తిగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో రంగస్థల కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

మౌలిక సౌలభ్యాలు

కల్పించాలని పాదయాత్ర

రాయచూరు రూరల్‌: నగర, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సౌలభ్యాలు కల్పించాలని జేడీఎస్‌ కలబుర్గి జిల్లా మహిళ అధ్యక్షురాలు మహేశ్వరి డిమాండ్‌ చేశారు. శుక్రవారం అళంద నుంచి కలబుర్గి జిల్లా అధికారి కార్యాలయం వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అళంద క్షేత్రంలో మహిళలకు శౌచాలయాలు లేవని పేర్కొన్నారు. తాగునీటి ఎద్దడి, రహదారుల మరమ్మతుల విషయంలో సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అళంద నుంచి 85 కి.మీ దూరం పాదయాత్రను చేస్తున్న తరుణంలో మహేశ్వరికి రహదారి వెంబడి మహిళలు మద్దతు ఇస్తున్నారు.

వాహనాల

సంచారంపై ఆంక్షలు

చిక్కబళ్లాపురం: నందిహిల్స్‌పై మారథాన్‌ పోటీలు ఏర్పాటు చేసినందున శనివారం రాత్రి 12 గంటల నుంచి ఆదివారం మద్యాహ్నం 12 గంటల వరకు కారహళ్లి క్రాస్‌ నుంచి నంది కొండ వరకు వాహన సంచారాన్ని బంద్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. 10 కిలోమీటర్లు, 21 కి.మీ విభాగంలో జరిగే మారథాన్‌కు 4500 మంది క్రీడా కారులు హాజరు కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement