ఆందోళన చేస్తాం | - | Sakshi
Sakshi News home page

ఆందోళన చేస్తాం

Jul 19 2026 12:03 AM | Updated on Jul 19 2026 12:03 AM

ఆందోళన చేస్తాం రెండు నెలల్లో ప్రారంభిస్తాం

చొప్పదండి, పరిసర మండలాల పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు గత ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేసింది. 12 మందికి పైగా స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉండాలి. త్వరలో ప్రారంభించకుంటే ప్రజలతో కలిసి ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తాం. కరీంనగర్‌ ఆసుపత్రిని మెడికల్‌ కాలేజీకి కేటాయించినందున, చొప్పదండిలోని వంద పడకల ఆసుపత్రి మున్ముందు జిల్లా ప్రధాన ఆసుపత్రి కానుంది.

– సుంకె రవిశంకర్‌, మాజీ ఎమ్మెల్యే, చొప్పదండి

ప్రస్తతం రీ డిప్లాయ్‌మెంట్‌లో చొప్పదండికి అవకాశం కల్పించలేదని మా దృష్టికి వచ్చింది. రీ డిప్లాయ్‌మెంట్‌తో సంబంధం లేకుండా.. పూర్తిస్థాయి రెగ్యులర్‌ స్టాఫ్‌ను నియమిస్తాం. ఆసుపత్రి నిర్మాణం దాదాపుగా పూర్తయింది. సదుపాయాల కోసం రూ.1.67 కోట్లు వచ్చాయి. మిగిలిన సుమారు రూ.3 కోట్ల నిధులతో అన్ని వసతులు కల్పిస్తాం. రెండునెలల్లో ఆసుపత్రిని ప్రారంభిస్తాం.

– మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే, చొప్పదండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement