హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’.సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు.
మెలొడీ బ్రహ్మ మణిశర్మ ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ నెల 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు ‘చెన్నై లవ్ స్టోరీ’మూవీ రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ అతిథులుగా పాల్గొన్నారు.
అల్లు అరవింద్ చేతుల మీదుగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.


