విద్యానగర్(కరీంనగర్): అరుణాచలం పుణ్యక్షేత్రానికి కరీంనగర్ నుంచి ప్రత్యేక ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు నడపనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ 1 డిపో మేనేజర్ ఐ.విజయమాధురి తెలిపారు. ఈనెల 25న శనివారం సాయంత్రం 4గంటలకు కరీంనగర్ బస్‌స్టేషన్ నుంచి బస్సు బయలుదేరుతుందన్నారు. యాత్రలో కాణిపాకం, శ్రీరంగం, మధురై, రామేశ్వరం మేదుగా పౌర్ణమి రోజు అరుణాచలం చేరుకుంటుందని అన్నారు. తిరుగు ప్రయాణంలో జోగులాంబ దర్శనం చేసుకొని 30వ తేదీ సాయంత్రం కరీంనగర్ చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.6,600. పిల్లలకు రూ.4,950 టికెట్ ఉంటుందని, వివరాలకు 73828 49352, 90634 01868, 99592 25920 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


