కరీంనగర్‌రూరల్: వర్షభావ పరిస్ధితులతో ఆందోళన చెందుతున్న రైతాంగానికి విద్యుత్ సమస్యలు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అధికారులు వ్యవసాయ విద్యుత్ సరఫరా వేళలను ఇటీవల మార్పు చేయడంతో రైతులు నిరీక్షించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. గతంలో కరీంనగర్‌రూరల్ డివిజన్‌లో వేకువజామున 2.15 నుంచి సాయంత్రం 5.30 గంటలవరకు విద్యుత్‌ను సరఫరా చేశారు. ప్రస్తుతం ఉదయం 7 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. సరిపడా నీళ్లులేక పొలాలు బీళ్లుగా ఉంటున్నాయి.


