గోరింటా మెరిసే.. మగువ మురిసే | - | Sakshi
Sakshi News home page

గోరింటా మెరిసే.. మగువ మురిసే

Jul 19 2026 12:15 AM | Updated on Jul 19 2026 12:15 AM

విద్యానగర్‌(కరీంనగర్‌): పండుగ.. పెళ్లి.. ఆషాఢం.. అంటేనే మగువలకు గోరింటాకు గుర్తుకొస్తుంది. ఒకప్పుడు గోరింటాకు తెంపుకొని చేతుల నిండా సింగారించుకునేవారు. ప్రస్తుతం ట్రెండ్‌కు తగ్గట్టుగా డిజైన్లు వేస్తూ ఆకట్టుకునేలా చేతులను సింగారించుకుంటున్నారు. చేతులకు, కాళ్లకు అందంగా అలంకరించుకుంటున్నారు. ఆషాఢం తెలుగు లోగిళ్లలో ఆత్మీయ అనుబంధాలను బలపరుస్తుంది. నిన్నటి వరకు తమ ఇంటి దీపమై వెలిగిన కూతురు మరో ఇంటి కోడలుగా వెళ్లి.. ఆషాఢంలో పుట్టింటికి చేరుతుంది. అత్తవారింటి ముచ్చట్లు పొద్దు ఇట్టే గడిచిపోతుంటుంది. ఆ ముచ్చట్లే మమతలై అరచేతి నిండా గోరింటగా పండుతుంది. అందుకే నవవధువుతోపాటు ఆషాఢంలో ఆడవాళ్లందరూ గోరింటాకు పెట్టుకునేందుకు ప్రాధాన్యతనిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement