పశువులు బాగుండాలని, పంటలు బాగా పండాలని మేము సీత్లాభవాని వేడుకలు నిర్వహిస్తాం. ఏటా ఆషాఢ మాసంలో ఈ వేడుకలు జరుపుకుంటాం. ఏడుగురు అక్కాచెల్లెళ్లలో ఒక్కరైన సీత్లాభవాని అమ్మవారికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ పండుగను గిరిజన గూడేల్లో అందరం కలిసి మెలిసి జరుపుకుంటాం.
– అజ్మీర రాజునాయక్, బాకూర్‌పల్లితండా
ఏటా ఆషాఢ మాసంలో సీత్లాభవాని వేడుకలు నిర్వహిస్తాం. ఈ పండుగను గిరిజన గూడేల్లోని అందరం కలిసి జరుపుకుంటాం. ఇంటి వద్దనే నైవేద్యం వండుకొని తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తాం. పండుగ ఇలా చేయాలని మా పెద్దల నుంచి తెలుసుకున్నాం.
– అజ్మీర సంధ్యారాణి,
బ్యాంక్ ఉద్యోగిని, బాకూర్‌పల్లితండా
ఆషాఢం ప్రవేశంతోనే పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. పాడిపంటలు బాగుండాలని గిరిజనులు సీత్లాభవాని అమ్మవారిని కొలిస్తే.. పల్లె ప్రజలు పోచమ్మతల్లికి బోనం తీసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అతివలు వర్షాకాలంలో తమ చేతులకు గోరింటాకుతో మరింత సింగారాన్ని అద్దుకుంటున్నారు. ఆషాఢం మాసంలో ఎటూ చూసిన పండుగ వాతావరణం.. ఆధ్యాత్మిక చింతన.. బంధుమిత్రుల కలయికలతో సందడిగా మారిపోతుంది. ఆషాఢ వేడుకలపై ప్రత్యేక కథనాలు.


