స్పోర్ట్స్‌ అకాడమీ పిలుస్తోంది | - | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్‌ అకాడమీ పిలుస్తోంది

Jul 19 2026 12:15 AM | Updated on Jul 19 2026 12:15 AM

కరీంనగర్‌స్పోర్ట్స్‌: రాష్ట్రంలోని యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి, అంతర్జాతీయస్థాయి శిక్షణ అందించేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ క్రీడల్లో శిక్షణకు శ్రీకారం చుట్టింది. 2026–2027 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్‌ అకాడమీలు, హన్మకొండలోని ప్రాంతీయ క్రీడా హాస్టల్‌లో ప్రవేశాలకు ఎంపిక పోటీల సెలక్షన్‌ ట్రయల్స్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాష్ట్రానికి చెందిన స్థానిక క్రీడాకారులకు మాత్రమే పరిమితమైన ఈ ఎంపికలు ప్రతిభను నిరూపించుకోవడానికి అద్భుతమైన వేదికగా నిలవనున్నాయి.

ఏ వయసు వారు అర్హులంటే

ఎంపిక పోటీలు ఈ నెల 20 నుంచి 28 వరకు రాష్ట్రంలోని వివిధ క్రీడాప్రాంగణాల్లో జరగనున్నాయి. క్రీడాంశాలను బట్టి వయసు పరిమితులను నిర్ణయించారు. జిమ్నాస్టిక్స్‌, స్విమ్మింగ్‌ విభాగాలకు 10 నుంచి 12ఏళ్ల లోపు చిన్నారులు, అథ్లెటిక్స్‌, సైక్లింగ్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, వాలీబాల్‌, రెజ్లింగ్‌, కబడ్డీ, ఫుట్‌బాల్‌ విభాగాలకు 14 నుంచి 16 ఏళ్లలోపు క్రీడాకారులు అర్హులు. సరూర్‌నగర్‌ వాలీబాల్‌ అకాడమీకి 16 నుంచి 18 ఏళ్ల ప్రత్యేక వయసు పరిమితిని కేటాయించారు.

పకడ్బందీగా ఎంపిక

ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించేందుకు డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా యువజన క్రీడా అధికారులు, సీనియర్‌ కోచ్‌లు, క్రీడా సంఘాల కార్యదర్శులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీలను నియమించారు. ఎంపికల్లో పూర్తి పారదర్శకత కోసం ప్రతి కమిటీలో ఒక అంతర్జాతీయ క్రీడాకారున్ని సభ్యుడిగా చేర్చడం విశేషం. హాజరయ్యే క్రీడాకారులు తమ వయసు, స్టడీ సర్టిఫికెట్‌, స్థానిక సంస్థల నుంచి పొందిన పుట్టిన వయసు ధ్రువీకరణ పత్రం లేదా 10వ తరగతి మెమో, 10 తాజా పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, ఆధార్‌కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. క్రీడాకారుల శారీరక సామర్థ్యం, వైద్య పరీక్షలు, నైపుణ్యాల ఆధారంగానే అకాడమీల్లో తుది ప్రవేశాలు కల్పించనున్నారు.

ఎంపికల తేదీలు, క్రీడలు

● జూలై 20న ఓయూ క్యాంపస్‌లో సైక్లింగ్‌ వెలోడ్రోమ్‌లో సైక్లింగ్‌, రెజ్లింగ్‌

● జూలై 20, 21న గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో హాకీ, అథ్లెటిక్స్‌, సరూర్‌నగర్‌లో వాలీబాల్‌, వనపర్తిలో హాకీ, హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో హ్యాండ్‌బాల్‌, ఫుట్‌బాల్‌

● జూలై 21న ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో అథ్లెటిక్స్‌

● జూలై 22, 23న సిద్దిపేటలో వాలీబాల్‌

● జూలై 25, 26 తేదీలలో మహబూబ్‌నగర్‌ మెయిన్‌ స్టేడియంలో వాలీబాల్‌, కబడ్డీ

● జూలై 27, 28 తేదీలలో హన్మకొండ జేఎన్‌ స్టేడియంలో జిమ్నాస్టిక్స్‌, స్విమ్మింగ్‌, అథ్లెటిక్స్‌, హ్యాండ్‌బాల్‌, రెజ్లింగ్‌

విడుదలైన నోటిఫికేషన్‌, 20 నుంచి ఎంపికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement