రామడుగు: వేసిన వారం రోజులకే ఎండుతున్న ఈ వరి పొలం వెదిర గ్రామంలోనిది. గ్రామానికి చెందిన కౌలు రైతు జయరాజు మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని రూ. 50వేలు పెట్టుబడి పెట్టి ఇటీవలే నాటు వేశాడు. బోరుబావి ద్వారా పంటను సాగు చేస్తుండగా.. సరిపడా నీరు అందడం లేదు. ఓ వైపు గాలి, మరో వైపు భూమిలోని ఉష్ణోగ్రతల కారణంగా బోరు నుంచి నీరు రావడం లేదని వాపోతున్నాడు. నీరందే సమయంలో విద్యుత్ ఉండడం లేదని చెబుతున్నాడు. ఫలితంగా పంట ఎండుతోందని, వచ్చే మూడు, నాలుగు రోజుల్లో వర్షాలు కురియకుంటే పంట మొత్తం ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నాడు. మండలంలోని వ్యవసాయబావుల్లో నీరు అడుగంటిపోవడంతో నారుమడులు పారే పరిస్థితి లేదని, వర్షాలు కురియకపోవడంతో నార్లు ముదిరి పోతున్నాయని వాపోతున్నారు.


