మడులు ఎండిపోతున్నాయి | - | Sakshi
Sakshi News home page

మడులు ఎండిపోతున్నాయి

Jul 19 2026 11:33 PM | Updated on Jul 19 2026 11:33 PM

మడులు ఎండిపోతున్నాయి 30 ఎకరాలు సాగు చేశా

గంగాధర: వానాకాలం సీజన్‌ ఆరంభంలో గంగాధర మండలంలో పొద్దంతా నడిచిన మోటార్లు ప్రస్తుతం గంటనైనా నడవడం లేదు. నాట్లు వేయకముందే దున్నిన పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొద్దంతా మోటార్లు నడిపించి పొలం పారిస్తే తెల్లారేసరికి నీళ్లు ఉండడం లేదని వాపోతున్నారు. కాలం కరుణించకపోతే వేసిన పొలాలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

నాకున్న ఐదెకరాలతో పాటు 25 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న. వానకాలంలో 30 ఎకరాలు, యాసంగిలో 20 ఎకరాలు వరి పంట సాగుచేస్తా. ఈ ఏడాది వానలు లేకపోవడంతో బావి ఎండిపోయింది. ఎనిమిదెకరాలు దున్నితే రెండెకరాలు నాటు వేశా. నీళ్లు లేక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది.

– మూల శ్రీనివాస్‌రెడ్డి, రైతు, కురిక్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement