శిశుమందిర్‌ నుంచి షార్‌కు.. | - | Sakshi
Sakshi News home page

శిశుమందిర్‌ నుంచి షార్‌కు..

Jul 19 2026 11:33 PM | Updated on Jul 19 2026 11:33 PM

శిశుమందిర్‌ నుంచి షార్‌కు..

సిరిసిల్లలోని పోస్టాఫీస్‌ వీధికి చెందిన అడుప సంతోష్‌ సరస్వతి శిశుమందిర్‌లో 3వ తరగతి వరకు చదువుకున్నారు. 4 నుంచి 10వ తరగతి వరకు శ్రీకృష్ణదేవరాయ హైస్కూల్‌లో చదివి, పాలిటెక్నిక్‌ను నిజామాబాద్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌(ఈఈఈ) పూర్తి చేశారు. భువనగిరిలో బీటెక్‌ చదివి డీఆర్‌డీఏలో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా చేరారు. మూడేళ్లపాటు సీనియర్‌ ఇంజినీర్‌గా ప్రైవేటు కంపెనీలో పనిచేసి 2024 నుంచి స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ప్రైవేటు లిమిటెండ్‌ కంపెనీలో టీమ్‌ లీడర్‌గా పనిచేశారు. రాకెట్‌ అవియానిక్స్‌ గ్రౌండ్‌ చెక్‌ అవుట్‌ ఇంటిగరేషన్‌ విభాగాన్ని పర్యవేక్షించారు. రాకెట్‌లో తనిఖీలు, పరీక్షలు, ప్రయోగానికి ముందు కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. సంతోష్‌ తండ్రి రమేశ్‌ ప్రైవేటు స్కూల్‌ టీచర్‌ కాగా.. తల్లి లత గృహిణి. అక్క అడుప కీర్తి ప్రభుత్వ టీచర్‌. సంతోష్‌కు భార్య వెన్ను అనూష, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement