మా చిన్నప్పుడు బొడ్డెమ్మ పండుగ వస్తుందంటే నెల రోజుల ముందు నుంచే సందడి మొదలయ్యేది. పుట్టమట్టి తెచ్చి, ఐదు అంతస్తుల గోపురంలా బొడ్డెమ్మను చేసి, పసుపు కుంకుమలతో అలంకరించేవాళ్లం. అప్పట్లో పెళ్లికాని ఆడపిల్లలందరూ ఒకచోట చేరి పాడుకునే పాటలు, ఆడే ఆటలు ఒక పెద్ద సంబరంలా ఉండేవి.
– పుల్లూరి రాధ, సిరిసిల్ల
ఐక్యతను చాటే సంరంభం
బొడ్డెమ్మ పండుగ మాత్రమే కాదు. ఆడపిల్లలకు క్రమశిక్షణ, తోటివారితో కలిసిమెలిసి ఉండే గుణాన్ని నేర్పే అద్భుతమైన సాంప్రదాయం. ప్రకృతిని (మట్టిని) పూజించడం ద్వారా మన మూలాలను గుర్తుచేసుకునే పండుగ. ఈతరం పిల్లలకు ఈ పండుగ గొప్పతనం తెలియజేయడం మన బాధ్యత.
– ఆచ్చి క్రాంతిశ్రీ, అధ్యాపకురాలు


