బొడ్డెమ్మ.. బొడ్డెమ్మ.. కోల్‌ ! | - | Sakshi
Sakshi News home page

బొడ్డెమ్మ.. బొడ్డెమ్మ.. కోల్‌ !

Oct 5 2026 1:33 AM | Updated on Oct 5 2026 1:33 AM

● తెలంగాణ సంస్కృతికి తొలివాకిలి ● ప్రకృతి ఆరాధన.. అతివల మురిపెం ● పల్లెల్లో తొమ్మిదొద్దుల వేడుక ● నేటి నుంచి జిల్లాలో షురూ..

● తెలంగాణ సంస్కృతికి తొలివాకిలి ● ప్రకృతి ఆరాధన.. అతివల మురిపెం ● పల్లెల్లో తొమ్మిదొద్దుల వేడుక ● నేటి నుంచి జిల్లాలో షురూ..

సిరిసిల్లటౌన్‌: బతుకమ్మ పండుగకు తొమ్మిది రోజు ల ముందు నుంచే బొడ్డెమ్మ పండుగతో పల్లెల్లో కో ల్‌..కోల్‌ పాటలు.. గౌరమ్మపాటలు..చందమామ పాటలు హోరెత్తుతాయి. పడతుల ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బొడ్డెమ్మ వేడుకలకు జిల్లా ముస్తామైంది. ఇప్పటికే పలు మండలాల్లో బొడ్డెమ్మ సంబ రాలు ప్రారంభం కాగా.. సిరిసిల్లలో సోమవారం మొదలవుతున్నాయి. భాద్రపద బహుళ పంచమి నుంచి మహాలయ అమావా స్య(పెత్రమాస) వరకు తొ మ్మిది రోజులపాటు ఈ వేడుకలు గ్రామాల్లో సందడి చేస్తాయి. సిరిసిల్లలో మాత్రం భాద్రపద దశమి నుంచి వేడుకలకు సిద్ధమైంది.

బొడ్డెమ్మ పండుగ విశిష్టత

తెలంగాణ జీవన విధానంలో బొడ్డెమ్మ పండుగకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. ప్రధానంగా పెళ్లికాని అమ్మాయిలు తమకు మంచి గుణగణాలున్న భర్త లభించాలని, భవిష్యత్‌ జీవితం సుఖసంతోషాలతో సాగాలని గౌరీదేవి రూపమైన బొడ్డెమ్మను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఈ పండుగ వర్ష రుతువు ముగింపు, శరద్‌ రుతువు ప్రారంభాన్ని సూచిస్తుంది.

ఐదు రకాలుగా బొడ్డెమ్మ

బొడ్డెమ్మను పుట్టమన్ను లేదా చెరువుమట్టితో ఐదు లేదా తొమ్మిది దొంతరలుగా గోపురం ఆకారంలో తయారు చేస్తారు. వీటిని ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పిలుపును బట్టి పీఠబొడ్డెమ్మ, గుంట బొ డ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ, అంతరా ల బొడ్డెమ్మ అని ఐదు రకాలుగా పూజిస్తారు. ఇక మట్టితో చేసిన బొడ్డెమ్మను పసుపు, కుంకుమ, తంగేడు, కట్లపూలతో అందంగా అలంకరిస్తారు. దాని పై బియ్యంతో నింపిన కలశాన్ని ఉంచి, పసుపు గౌ రమ్మను ప్రతిష్ఠిస్తారు. రోజూ సాయంత్రం చిన్నారులు, యువతులు వీధుల్లో బొడ్డెమ్మను ప్రతిష్ఠించి.. చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పా డుతారు. జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడ పరిసర ప్రాంతాలు బొడ్డెమ్మ సంబరాలకు ప్రసిద్ధి. ఇక్కడి మహిళలు, బాలికలు ఐదు రోజులపాటు భ క్తిశ్రద్ధలతో పూజలు చేసి, చివరగా రాజన్న ఆలయ ధర్మగుండం, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు.

పప్పు, బెల్లం ప్రసాదం

రోజూ బొడ్డెమ్మకు పప్పు, బెల్లం, పులిహోర వంటి పిండివంటలను నైవేద్యంగా సమర్పిస్తారు. వేడుకల చివరి రోజున ఈ మట్టి బొమ్మలను స్థానిక చెరువుల్లో లేదా జలాశయాల్లో నిమజ్జనం చేయడంతో బొడ్డెమ్మ పండుగ ముగుస్తుంది.

‘బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్‌..

బిడ్డా లెం దారే కోల్‌

నీ ఇల్లు ఎక్కడో కోల్‌..

నీ పేరేమిటో కోల్‌

పసుపు కుంకుమల కోల్‌..

పడతుల నోములు కోల్‌..’

‘చిత్తూ చిత్తూల బొమ్మ..

శివుని ముద్దుల గుమ్మ

బొడ్డెమ్మ దేవికి.. పూజల వేళాయెనమ్మా

తంగేడు పూల తోటి..

తలనోము నోచింది

గునుగు పూల బాటలో..

గోరంత నవ్వింది

పల్లె పల్లెంతా ఏకమై..

నీ చుట్టూ తిరిగింది..’ అంటూ పడచు పిల్లలు.. మహిళలు పల్లెల్లో సంబురంగా బొడ్డెమ్మ వేడుకలు చేసుకుంటారు. జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement