ప్రశాంతంగా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ ఎన్నికలు

Oct 5 2026 1:33 AM | Updated on Oct 5 2026 1:33 AM

డైరెక్టర్లుగా విజేతల ప్రకటన రాత్రి 10.30గంటల వరకు కౌంటింగ్‌ ఓటేసింది 3,101 మంది ఓటర్లే పోలైంది 18.37శాతమే నేడు చైర్మన్‌ ఎన్నిక

కరీంనగర్‌అర్బన్‌: ఎట్టకేలకు ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం స్థానిక ఎస్సారార్‌ కశాళాలలో ఎన్నికల పోలింగ్‌ జరగగా సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. రాత్రి 10.30గంటల వరకు కౌంటింగ్‌ కొనసాగగా 15 మంది డైరెక్టర్లను విజేతలుగా ప్రకటించారు. 17మంది బరిలో ఉండగా ఓటింగ్‌ అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉదయం 8గంటల నుంచే పోలింగ్‌ ప్రారంభమవగా మధ్యాహ్నం 12గంటల వరకు ఓటర్లు బారులు తీరారు. తదుపరి 3గంటల వరకు మందకొడిగా పోలింగ్‌ సాగింది. 16,876 మంది ఓటర్లకు గానూ 3,101 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే మొత్తం ఓటర్లతో పోల్చితే 18.37శాతమే పోలింగ్‌ జరిగింది. ఎన్నికల పరిశీలకుడు, అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఎంప్లాయీస్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, టీజీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్‌, కార్యదర్శి ఎడ్ల అరవింద్‌రెడ్డి, ఇతర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారి రామానుజాచార్యులు, సహాయ ఎన్నికల అధికారి జలాలుద్దీన్‌అక్బర్‌ ఏర్పాట్లను సమీక్షించారు. సాయంత్రం 4గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా రాత్రి 10.30గంటల వరకు సాగింది. సోమవారం పదాధికారులను ఎన్నుకోనున్నారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కోశాధికారి పోస్టులకు డైరెక్టర్లతో ఓటింగ్‌ చేపట్టనున్నారు.

విజేతలు వీరే

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ డైరెక్టర్లుగా గెలిచిన వారి వివరాలను ఎన్నికల అధికారి సీహెచ్‌.రామానుజాచార్యులు ప్రకటించారు. కుందారపు మహేశ్వర్‌, పెండ్యాల కేశవరెడ్డి, కనపర్తి మనోహర్‌రావు, సంగెం లక్ష్మణ్‌రావు, కోల అన్నారెడ్డి, పి.విద్యాసాగర్‌, సాయినేని నరేందర్‌, సీహెచ్‌ సురేశ్‌, పి.శ్రీహరిరెడ్డి, ఎ.మునీందర్‌, గోనె శ్రీనివాస్‌, వూట్కూరి రాధాకృష్ణారెడ్డి, హన్మాండ్ల రాజిరెడ్డి, మొగులోజు రాకేశ్‌, రాగి శ్రీనివాస్‌ విజయం సాధించారు.

రెడ్‌క్రాస్‌ ఎన్నికల తీరిలా..

బరిలో నిలిచింది : 17మంది అభ్యర్థులు

మొత్తం ఓటర్లు : 16,876

ఓటేసినవారు : 3,101

పోలింగ్‌శాతం : 18.37

పోలింగ్‌ కేంద్రాలు : 20

ఒక బూత్‌లో అత్యధికంగా పోలైన ఓట్లు: 194

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement