● రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి
గోదావరిఖని: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కు మారున్ని చూడటానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి చెందింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన బెజ్జంకి రాజమణి(49) గుర్తుతెలియని కారు ఢీకొనడంతో శనివారం మృతి చెందింది. కూలీ పనిచేసుకుంటూ జీవిస్తున్న రాజమణి.. తన కుమారున్ని చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించింది. ఆ తర్వాత కుమారుడి చూడటానికి వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో స్థానిక రాజేశ్ థియేటర్ సమీపంలోని మూలమలుపు వ ద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని కారు బలంగా ఢీకొ ట్టింది. దీంతో తీవ్రగాయాల పాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. మృతురాలి కొడుకు బెజ్జంకి ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌న్‌టౌన్ ఎస్‌ఐ సంధ్యారాణి కేసు నమోదు చేసుకున్నారు. పరారైన కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


