కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన గెంటె రేణుక ఆత్మహత్యకు కారణమైన భర్త ప్రశాంత్‌ను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రవీందర్‌రె తెలిపారు. కోనరావుపేట ఠాణాలో వివరాలు వెల్లడించారు. బావుసాయిపేటకు చెందిన రేణుకను ఆమె భర్త ప్రశాంత్, ఆడబిడ్డ పద్మ, అత్త కొమురవ్వలు అదనపుకట్నం తెమ్మంటూ శారీరకంగా, మానసికంగా వేధించసాగారు. వారి వేధింపులను భరించలేక రేణుక శనివారం ఆత్మహత్య చేసుకుంది. రేణుక ఆత్మహత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రశాంత్‌ను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు వివరించారు. ఎస్సై రామ్మోహన్ ఉన్నారు.


