నారు ముదురుతోంది | - | Sakshi
Sakshi News home page

నారు ముదురుతోంది

Jul 19 2026 11:33 PM | Updated on Jul 19 2026 11:33 PM

నారు ముదురుతోంది మడులు తడవడం లేదు

బోయినపల్లి(చొప్పదండి): వరి నారు ముదురుతున్నా.. నీళ్లు లేక ఒక్క మడి తడవడం లేదని బోయినపల్లికి చెందిన కౌలు రైతు ఆవేదన చెందాడు. రూ.15 వేలకు ఎకరం చొప్పున మూడున్నర ఎకరాలు కౌలుకు తీసుకున్నట్లు పేర్కొన్నాడు. కొద్ది రోజుల క్రితం వరినారు పోస్తే బావిలో నీళ్లు లేక పొలం మడులు తడవడం లేదని వాపోయాడు. ఉన్న కొద్దిపాటి నీళ్లు వాడుదామంటే కరెంట్‌ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని చెప్పాడు.

కౌలు డబ్బులు సగం కట్టిన. నారు ముదురుతోంది. పొలం దున్నుదామంటే ఒక్క మడి తడవడం లేదు. వానలకోసం ఎదురుచూసుడవుతుంది. మూడున్నరేకరాలు బీడుగానే ఉంది.

– బోయిని మల్లేశం, బోయినపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement