అమ్మవారికి క్యాప్సికం మాలలతో అలంకరణ | - | Sakshi
Sakshi News home page

అమ్మవారికి క్యాప్సికం మాలలతో అలంకరణ

Jul 19 2026 12:03 AM | Updated on Jul 19 2026 12:03 AM

డిగ్రీ ప్రవేశాలకు చివరి అవకాశం

విద్యానగర్‌(కరీంనగర్‌): నగునూర్‌ శ్రీదుర్గాభవానీ ఆలయంలో ఆషా ఢమాసం శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా నాలు గోరోజైన శని వారం శ్రీదుర్గాభవానీ అమ్మవారిని క్యాప్సికం మాలలతో అలంకరించారు. అమ్మవారికి ప్రధానార్చకుడు పవనకృష్ణ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఫౌండర్‌ చైర్మన్‌ వంగల లక్ష్మణ్‌, భక్తులు పాల్గొన్నారు.

ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో 64 కేసులు పరిష్కారం

కరీంనగర్‌క్రైం: జాతీయ, రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా కోర్టులో శనివారం ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శివకుమార్‌ పర్యవేక్షణలో, జిల్లా న్యాయ సేవా అధి కార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి, ప్రిన్సిపల్‌ సీని యర్‌ సివిల్‌ జడ్జి కె.రాణి జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న చెక్‌బౌన్స్‌, బ్యాంకు రికవరీ కేసులను లోక్‌ అదాలత్‌లో విచారణకు తీసుకున్నా రు. ఇరుపక్షాల అంగీకారంతో రాజీ మార్గంలో పరిష్కరించారు. మొత్తం 27 చెక్‌బౌన్స్‌ కేసులు పరిష్కారం కాగా.. రూ.46,87,540 మేర రాజీ కుదిరింది. 37 బ్యాంకు రికవరీ కేసులు పరిష్కారమై రూ.9,71,200 మేర వసూళ్లకు మార్గం సుగమమైంది. మొత్తంగా 64 కేసుల్లో రూ.56,58,740 విలువైన వివాదాలు పరిష్కారమైనట్లు కె.రాణి తెలిపారు.

ఉద్యోగులే సంఘానికి పునాదిరాళ్లు

కరీంనగర్‌ అర్బన్‌: ఉద్యోగులే సంఘానికి పునా దిరాళ్లని, వారి సంక్షేమానికి టీఎన్జీవో కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం తెలంగాణ ఎన్జీవోల సంఘం కరీంనగర్‌ జిల్లా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం స్థానిక సంఘ భవనంలో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు గుర్తింపు పొందిన బ్యాంకుల ద్వారా రూ.1.20 కోట్ల ప్రమాద బీమా సౌకర్యం కల్పించే చర్యలు చేపట్టడం, అలాగే ఉద్యోగులందరికీ హెల్త్‌ కార్డులు అందుబాటులోకి తీసుకురావడం పట్ల తెలంగాణ ఎన్జీవోల సంఘం తరఫున హర్షం తెలిపారు. హెల్త్‌ కార్డు ద్వారా ఆసుపత్రుల్లో చేరే ఇన్‌పేషెంట్‌ సేవలతో పాటు, ఔట్‌పేషెంట్‌ సేవలను కూడా సమర్థవంతంగా అమలు చేయాలని, వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగా అవసరమైన బ్రాండెడ్‌ మందులను ఉద్యోగులకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల తెలంగాణ ఎన్జీవోల సంఘం నుంచి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన సంఘ నాయకులు, సభ్యులను ఘనంగా సన్మానించారు.

కరీంనగర్‌సిటీ: 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ దోస్త్‌ ప్రక్రియ చివరి విడత స్పెషల్‌ ఫేజ్‌ షెడ్యూల్‌ను జూలై 17న ఉన్నత విద్యామండలి విడుదల చేసిందని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.రామకష్ణ తెలిపారు. స్పెషల్‌ ఫేజ్‌ షెడ్యూల్‌ ప్రకారం జూలై 20 నుంచి 26 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 27 వరకు వెబ్‌ ఆప్షన్ల ద్వారా కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకోవచ్చన్నారు. జూలై 30న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. సీటు పొందినవారు జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలన్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 1లోపు ఒరిజినల్‌ ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌తో పాటు ఇతర విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్‌ కాపీలతో కళాశాలలో రిపోర్ట్‌ చేయాలన్నారు. ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయకపోయినా లేదా నిర్ణీత గడువులో కళాశాలలో రిపోర్ట్‌ చేయకపోయినా కేటాయించిన సీటు రద్దు అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు దోస్త్‌లో రిజిస్ట్రేషన్‌ చేయని విద్యార్థులు రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి స్పెషల్‌ ఫేజ్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. సీసీఓటీపీ ద్వారా కళాశాలలో ప్రవేశం పొందినవారికి స్పెషల్‌ ఫేజ్‌లో అవకాశం ఉండదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement