పారదర్శకంగా గృహలబ్ధిదారుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా గృహలబ్ధిదారుల ఎంపిక

Jul 19 2026 12:03 AM | Updated on Jul 19 2026 12:03 AM

పారదర్శకంగా గృహలబ్ధిదారుల ఎంపిక

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నిబంధనల ప్రకారమే గృహ లబ్ధిదారులను ఎంపిక చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ ఆదేశించారు. శనివారం నగరపాలకసంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్‌, టౌన్‌ప్లానింగ్‌, హౌసింగ్‌ విభాగాలతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరగాలన్నారు. గతంలో వచ్చిన దరఖాస్తుల ప్రకారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, అర్హులను ఎంపిక చేయాలన్నారు. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లలో లబ్ధిదారులుగా ఎంపికై ఇప్పటి వరకు ఇండ్లు నిర్మాణం చేయని వారికి నోటీసులు జారీ చేయాలన్నారు. నోటీసులకు స్పందించని లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టొద్దన్నారు. సెక్షన్లవారీగా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, త్వరితగతంగా పరిష్కరించాలన్నారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ ఆయాజ్‌, డిప్యూటీ కమిషనర్లు ఖాదర్‌మొహియొద్దిన్‌, వేణుమాధవ్‌, డీఈలు వెంకటేశ్వర్లు, దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, డీసీపీ బషీరొద్దీన్‌, ఏసీపీలు శ్రీధర్‌, వేణు, ఏఈలు సతీశ్‌, భీంవర్ధన్‌ రెడ్డి, నర్మద పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement