డ్రెస్సులు కొనుగోలు చేస్తున్న ఇతను సోమిడి నగేశ్(45). జిల్లా కేంద్రంలోని బీ.వై.నగర్‌కు చెందిన నగేశ్ పెయింటర్‌గా పనిచేస్తారు. నిత్యం పనిలో బట్టలపై రంగులు పడడంతో పాడవుతుంటాయి. అందుకే పాత డ్రెస్సులను కొనుగోలు చేసి పనిలో వాడుతుంటారు. డ్రెస్సులు బాగుంటే.. ఫంక్షన్లకు కూడా వినియోగిస్తారు. నగేశ్ తనకు కావాల్సిన డ్రెస్సులను ఏళ్లుగా ఇక్కడే కొనుగోలు చేయడం విశేషం.
సిరిసిల్ల పట్టణంలోని గాంధీచౌక్‌లో డ్రెస్సులు కొనుగోలు చేస్తున్న ఇతను నాగిండ్ల నర్సయ్య(40). కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన నర్సయ్య సిరిసిల్ల లేబర్ అడ్డాపై కూలీ పని కోసం వస్తారు. సిరిసిల్లలో ప్రతీ ఆదివారం పాతబట్టలు(డ్రెస్‌లు) అమ్మకాలు సాగుతుంటే తక్కువ ధరకే లభించడంతో పనిలో అక్కరకు వస్తాయని తనకు అవసమైనవి ఇలా కొనుగోలు చేస్తూ ఉంటాడు.


