పదో తరగతి విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

పదో తరగతి విద్యార్థులు

Apr 12 2026 2:42 AM | Updated on Apr 12 2026 2:42 AM

పదో తరగతి విద్యార్థులు

మార్కులు..ర్యాంకులే చదువుకు కొలమానం అనుకుంటున్న

నేటితరం విద్యార్థులు ఒక్కక్షణం ఆగండి.. వీరి విజయగాథలు చదవండి. పదో తరగతిలో ఫెయిలైన వారు.. ఇంటర్‌లో అత్తెసరు మార్కులతో పాసైన వారు.. డిగ్రీ కూడా చదవని వారు.. అద్భుతాలు సృష్టించారు. వారు వేసిన మార్గంలోనే నేడు డిగ్రీ.. బీటెక్‌.. ఎంటెక్‌ విద్యార్థులు ముందుకెళ్తున్నారు. డిగ్రీ పూర్తి చేయని బిల్‌గేట్స్‌.. బోర్డు ఎగ్జామ్‌ రాయని సచిన్‌ టెండూల్కర్‌.. ఆటోడ్రైవర్‌గా జీవితాన్ని ఆరంభించిన సత్యశంకర్‌ విజయాలే మనకు మార్గంకావాలి. అంతెందుకు మన జిల్లా వాసి.. కొత్తగట్టుకు చెందిన కోరెం అశోక్‌రెడ్డి ఇంటర్‌ ఫెయిలయ్యానని కుంగిపోయి ఉంటే ఈరోజు ఐఏఎస్‌ అయ్యేవారే కాదు.. అందుకే ఒక్క క్షణం ఆలోచించండి.. పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయని.. ఇంటర్‌ ఫెయిల్‌ అయ్యామని కుంగిపోకండి. దీని తర్వాత జీవితం చాలా ఉంది. ధైర్యంతో ముందుకెళ్తే మీలో నుంచే ఓ బిల్‌గేట్స్‌.. సత్యశంకర్‌.. మనోజ్‌కుమార్‌శర్మ.. కోరెం అశోక్‌రెడ్డి వారసులు రావచ్చు. ఇంటర్‌ ఫలితాలు ఎలా ఉన్నా.. ధైర్యంగా ముందుకెళ్దాం.. – సప్తగిరికాలనీ(కరీంనగర్‌)

– వివరాలు 8లో...

36,426

8,106

18,251

4,060

18,175

కరీంనగర్‌

రాజన్నసిరిసిల్ల

‘సత్యశంకర్‌.. ఓ పానీయం ఉత్పత్తి చేసే బిందు కంపెనీ యజమాని. ఆయన ఇంటర్‌ వరకు చదువుకుని ఆటో డ్రైవర్‌గా తన ప్రస్థానం మొదలుపెట్టారు. అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఇప్పుడు రూ.800 కోట్ల వ్యాపారానికి యజమాని అయ్యారు. ఆయనే వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు.’

‘మనోజ్‌కుమార్‌శర్మ.. మధ్యప్రదేశ్‌లోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు. 12వ తరగతిలో ఫెయిల్‌ అయ్యాడు. కానీ నిరాశ చెందలేదు. ఐపీఎస్‌ అయ్యారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర పోలీస్‌లో ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ హోదాలో పనిచేస్తున్నారు.’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement