పిల్లల ఫలితాల కంటే వారి ఆరోగ్యం, ఆనందమే ముఖ్యమని తల్లిదండ్రులు భావించాలి. వారు ఎంత కష్టపడ్డారో గుర్తించాలి. ఫలితాలు ఎలా వచ్చినా మేము అండగా ఉంటామన్న భరోసాను కల్పించాలి. పిల్లలు ఒత్తిడికి గురికాకుండా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ప్రేమ, నమ్మకం ఇవ్వడం చాలా అవసరం.
– కె.సత్యనారాయణ, పేరెంట్
పరీక్షలు ఒక భాగం మాత్రమే
పరీక్షలు చదువులో ఒక భాగం మాత్రమేనని విద్యార్థులు గ్రహించాలి. మార్కులు తక్కువ వచ్చినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. లోపాలను గుర్తించి మళ్లీ ప్రయత్నిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఉపాధ్యాయులు ఎప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటారు. కష్టపడితే విజయం తప్పక దక్కుతుంది.
– ఎ.నిర్మల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, కరీంనగర్


