డ్రగ్స్‌ నివారణలో కెమిస్ట్‌ల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ నివారణలో కెమిస్ట్‌ల పాత్ర కీలకం

Apr 12 2026 2:42 AM | Updated on Apr 12 2026 2:42 AM

మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ చరిత్రాత్మకం

కరీంనగర్‌: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కెమిస్ట్స్‌– డ్రగ్గిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం సే నో టు డ్రగ్స్‌ నినాదంతో కోర్టు ప్రాంగణం నుంచి కెమిస్ట్‌ భవన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కెమిస్ట్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నరసయ్య మాట్లాడారు. మాదకద్రవ్యాల వాడకంతో కలిగే నష్టాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. డ్రగ్స్‌ దుష్ప్రభావాలు, వాటి నివారణలో కెమిస్ట్‌ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. డీఎస్‌పీ ఉపేందర్‌, ఈగిల్‌ ఫోర్స్‌, నార్కోటిక్‌ సీఐ రఫిక్‌ఖాన్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ, అసోసియేషన్‌ అధ్యక్షుడు కంటాల రామ్మోహన్‌, ప్రధాన కార్యదర్శి మునీందర్‌, కోశాధికారి కొంజర్ల మహేశ్‌, గౌరవాధ్యక్షుడు ఎం.రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

క్షేత్ర పర్యటనతో విజ్ఞానం

కరీంనగర్‌సిటీ: క్షేత్ర పర్యటనతో విద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుందని ఎస్సారార్‌ కాలేజీ వృక్షశాస్త్ర విభాగాధిపతి ఆచార్య తిరుకోవెల శ్రీనివాస్‌ అన్నారు. వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శనివారం ములుగు జిల్లా పాలంపేట చెరువు, పాకాల చెరువు, రామప్ప ఆలయం, తాడ్వాయి అభయారణ్యాన్ని సందర్శించారు. వివిధ జాతుల వృక్షాలను అధ్యయనం చేశా రు. ఆకురాల్చే అడవులు, తదితర అంశాలపై డాక్టర్‌ రౌతు రాధాకృష్ణ, డాక్టర్‌ మహమ్మద్‌ తాహిర్‌హుస్సేన్‌ విద్యార్థులకు వివరించారు.

సమర్థవంతంగా వ్యసనాల నివారణ

కరీంనగర్‌: మాదక ద్రవ్యాలు, మద్యపాన వ్యసనాల నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తరించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంటకరమణ అన్నారు. ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా శనివారం కరీంనగర్‌లోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, అశోకనగర్‌లోని డి అడిక్షన్‌ సెంటర్లను సందర్శించి మాట్లాడారు. బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, చికిత్స విధానం, సదుపాయాల్లో ఎలాంటి లోపాలు ఉండకుండా చూడాలన్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ ఎండీ తాఖియొద్దీన్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వీరారెడ్డి, ఆర్‌ఎంవో డాక్టర్‌ నవీన తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్‌: పార్లమెంట్‌, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లను రిజర్వ్‌ చేస్తూ, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే చారిత్రక చట్టం అమలుకు కౌంట్‌ డౌన్‌ మొదలైందని, ఈనెల 16న చట్టం అమలు కాబోతున్న సందర్భంగా బీజేపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాల పాటు నిలిచిపోయిన మహిళల హక్కు ఇప్పుడు సాకారమవుతుందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం వహించే హక్కు లభిస్తుందన్నారు. రాజకీయాల్లో మహిళలకు న్యాయమైన వాటా కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మహిళలు ఈ సంబరాల్లో అధిక సంఖ్యలో పాల్గొనేలా కృషిచేసి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు. అలాగే ఈనెల 14 డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, మాడ వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకులు ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, గుజ్జ శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు సా యిని మల్లేశం, మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, కార్పొరేటర్లు, మండల, జోన్‌ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement