‘మసూద’, ‘పరేషాన్’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్’వంటి విభిన్న చిత్రాలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో తిరువీర్, ఇప్పుడు ‘పాపం ప్రతాప్’ అనే మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ నెల 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


